• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాయుడి ఎఫెక్ట్‌:...

రాయుడి ఎఫెక్ట్‌: శ్రీకాళ‌హ‌స్తిలో ఏం జ‌రుగుతోంది.. ?

| ఇటీవల రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయుడి హత్య.. జనసేన పార్టీ మాజీ నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోలు అందరికీ తెలిసిందే.

By - Garuda Media
Update: 2025-10-17 06:22 GMT

ఇటీవల రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయుడి హత్య.. జనసేన పార్టీ మాజీ నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోలు అందరికీ తెలిసిందే. రాయుడి డెడ్ బాడీ చెన్నైలో లభించడం అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి కోట వినుత‌ హస్తం ఉందని భావించి ఆమెను అరెస్టు చేసిన విషయం రాజకీయంగా పెద్ద దుమారాలను రూపింది. అయితే అనంతర పరిణామాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అదేవిధంగా కోట వినుత‌ల మధ్య రాజకీయంగా చోటుచేసుకున్న విభేదాలు తెలిసిందే. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకున్నారు.

అయితే, ఎంత జరుగుతున్నప్పటికీ ఇటు టిడిపిలో గానీ అటు జనసేనలో కానీ ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. తాము వినుతను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఇక ఆమె గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నట్టుగా జనసేన నాయకులు భావిస్తున్నారు. కానీ, వాస్తవానికి పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ లేదా పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ కూడా వినుత చేసిన వ్యవహారాలు పార్టీకి అంటకుండా అయితే పోవు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది.

మరోవైపు టిడిపి నాయకులూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి విషయంలో మౌనంగా ఉన్నారు. ఆయన ఇటీవల దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని తాను నిజాయితీపరుడిన‌ని చెప్పుకొచ్చారు. అయితే టిడిపిలో మాత్రం ఈ విషయంపై ఎవరూ స్పందించడం లేదు. ఎవరి మా నాన వారు మౌనంగా ఉన్నారు. కానీ, శ్రీకాళహస్తిలో మాత్రం ప్రజలు ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న మీడియా సహా సోషల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.

ప్రశాంతమైన నియోజకవర్గాన్ని, వివాదరహితంగా ఉన్న నియోజకవర్గాన్ని ఇటు జనసేన అటు టిడిపి నాయకులు ఇద్దరు భ్రష్టు పట్టించారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది బలపడితే ఈ రెండు పార్టీలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసిపికి ఇది అంది వచ్చిన పరిణామంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో రెండు పార్టీలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట.

తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీలపై ఉంటుంది. కేవలం బహిష్కరించామని వదిలేస్తే రేపటి రోజున జనసేన పార్టీ బలోపేతం అవటం మాట ఎలా ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం పైనే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

Tags:    
  • RayuduMu*rder 
  • JanaSena 
  • TDP 
  • SrikalahastiPolitics 
  • KotaVenitha 
  • BojjalaSudheerReddy 
  • PoliticalControversy 
  • YSRCP 

Similar News

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

Copyright @2026

Powered by Blink CMS