• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణలో మార్పు...

తెలంగాణలో మార్పు కావాలి...పవన్ మాటల వెనక వ్యూహం ?

| తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికి సగం పాలన పూర్తి అయింది మరో రెండున్నరేళ్ళ పాటు చేతిలో అధికారం కాంగ్రెస్ కి ఉంది.

By - Satya P
Update: 2026-06-03 03:50 GMT

తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికి సగం పాలన పూర్తి అయింది మరో రెండున్నరేళ్ళ పాటు చేతిలో అధికారం కాంగ్రెస్ కి ఉంది. మళ్ళీ మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని రేవంత్ రెడ్డి సందర్భం వచ్చిన ప్రతీ సారీ గట్టిగానే చెబుతున్నారు. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవాలని బీఆర్ఎస్ కాచుకుని ఉంది. ఇక బీజేపీ సైతం 2028 ఎన్నికల మీద గురి పెట్టి ఉంది. ఇదీ తెలంగాణాలో గ్రౌండ్ లో ఉన్న పొలిటికల్ రియల్ పిక్చర్. అలాంటి చోట జనసేన ఎంట్రీ ఇస్తామని అంటోంది. ఇక మీదట ఇక్కడ పోటీ చేస్తామని కూడా పవన్ బల్ల గుద్ది మరీ చెప్పారు. అంతే కాదు తనకు కావాల్సింది మార్పు అన్నారు. మరి ఒక వైపు రాజకీయంగా పోటీకి దిగుతామని చెప్పి సామాజిక తెలంగాణా అంటున్నారు. మరి ఏ మార్పుని ఆయన కోరుకుంటున్నారు అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది.

ద్వేషం లేదు అంటూ :

ఇక తనకు కానీ జనసేనకు గానీ తెలంగాణా మీద ఎలాంటి ద్వేషం లేదని పవన్ అన్నారు. అయితే జనసేన తెలంగాణాను వ్యతిరేకించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే వ్యతిరేకించాం అని ఆయన స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ తలుపులు మూసేసి రెండు రాష్ట్రాలను విభజించడం తప్పని చెప్పాను అని అన్నారు. అంతేకానీ తెలంగాణా పైన వేరే ఎలాంటి భేదభావమూ లేదని పూర్తి వివరణ ఇచ్చారు. ఇక ఏపీలో తనను తిరగనివ్వమని చెప్పిన సమయంలో వారాహి యాత్రకు అనుమతిచ్చిందే తెలంగాణ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణా నుంచి తానేం కోరుకోట్లేదని, ఒక్క మార్పును తప్ప అని పవన్ వ్యాఖ్యానించడం విశేషం.

ఏ రకమైన మార్పు :

జనసేన సభను నిర్వహించనీయలేదు కానీ దాని పేరు నవ నిర్మాణ సభ. అంటే కొత్తగా తెలంగాణాను నిర్మించడం అన్న మాట. ఇప్పటిదాకా తెలంగాణాను బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పాలించాయి. మరి ఈ రెండు పార్టీలు చేయలేని తీసుకుని రాలేని మార్పు ఏదో జనసేన ఆకాంక్షిస్తోందా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం. జనసేన ఊహించే ఆ మార్పు ఏమిటి ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఎవరి ఊహకు వారు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ నోటి వెంట మార్పు అన్న మాట మాత్రమే వచ్చింది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మీద నిప్పులు చెరిగారు. అంతే కాదు ప్రతీ సమస్య మీద పోరాడుతాను అన్నారు.

2028 ఎన్నికలే టార్గెట్ :

కాంగ్రెస్ తీరునే అడుగడుగునా ఎండగట్టారు. నాటి వైఎస్సార్ నుంచి నేటి నేతల వరకూ అందరికీ తూర్పార పట్టారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే పవన్ సమర శంఖం పూరించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ మీదనే ఆయన ఫైర్ అయిన తీరుని చూస్తే కనుక మార్పు అన్నది ఆ పార్టీని రాజకీయంగా సవాల్ చేయడం ద్వారానేనా అన్నది కూడా చర్చ సాగుతొంది. ఇక ఏపీలో చూస్తే బీజేపీ జనసేన మిత్ర పక్షాలు. తెలంగాణాలో బీజేపీ తన దారిన తాను పోరాటం చేస్తోంది. జనసేన తన రాజకీయం ఏమిటో చెప్పకనే చెప్పింది. అయితే ఇక్కడా ఈ రెండు పార్టీలూ మిత్రులుగా మారి కొత్త శక్తిగా రంగంలోకి దిగుతాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అలాగే దీనిని బట్టి చూస్తే 2028 ఎన్నికలే టార్గెట్ గానేనా ఈ మార్పు కావాలి అన్న నినాదం ఎత్తుకున్నది అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి పవన్ మాటల వెనక అయితే పక్కాగా వ్యూహం ఉందని అంటున్నారు. అది ఏమిటి అన్నది తొందరలోనే తెలుస్తుందని కూడా అంటున్నారు.


ఈ గొడవ అంతా ఎక్కడ మొదలైంది?

తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా తెలంగాణలో ఉపాధి లేక‌పోతే ఆంధ్రోడే కారణమా? పవన్ కళ్యాణే కారణమా? తెలంగాణ ప్రజలు గమనించాలి.

- #PawanKalyan#JanaseanParty #Telangana #AndhraPradesh #TeluguNews #Tupaki

Follow 👉 @tupaki_official pic.twitter.com/P0lQeAObfX

— Tupaki (@tupaki_official) June 2, 2026



జనసేన పెట్టిందే తెలంగాణ నడిబొడ్డు హైదరాబాదులో.

జనసేనకు తెలంగాణపై ఉన్న ప్రేమ ఇప్పటిది కాదు... ప్రత్యేక రాష్ట్రం రాక ముందే ఉన్న నాయకులు మావాళ్ళు.

- #PawanKalyan#JanaseanParty #Telangana #AndhraPradesh #TeluguNews #Tupaki

Follow 👉 @tupaki_official pic.twitter.com/z7kfgVstma

— Tupaki (@tupaki_official) June 2, 2026



11 రోజులు తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజన జరిగిన తీరుకు..

ఎవరు ఎలా అర్థం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు.

- #PawanKalyan#JanaseanParty #Telangana #AndhraPradesh #TeluguNews #Tupaki

Follow 👉 @tupaki_official pic.twitter.com/SLqIQtlG3b

— Tupaki (@tupaki_official) June 2, 2026


మీరు ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి నేను వ‌స్తా.

- #PawanKalyan#JanaseanParty #Telangana #AndhraPradesh #TeluguNews #Tupaki

Follow 👉 @tupaki_official pic.twitter.com/3LwVJhk1tX

— Tupaki (@tupaki_official) June 2, 2026



నాకు ఆప‌రేష‌న్ జ‌రిగిన రోజు... ఓ అధికారి చెప్పిన మాట‌లు ఇవి.

ఆరోజు వ‌ర‌కు నేను న‌మ్మ‌లే. కానీ రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆ అధికారి చెప్పిందే చేశారు.

- #PawanKalyan#JanaseanParty #Telangana #AndhraPradesh #TeluguNews #Tupaki

Follow 👉 @tupaki_official pic.twitter.com/WTdv0Yrzgz

— Tupaki (@tupaki_official) June 2, 2026


ఆంధ్రా కొడకల్లారా...

తెలంగాణ నాయకులూ ఇలా ఎన్ని అన‌లేదు. ఆంధ్ర ప్ర‌జ‌ల్ని... ఇందులో రెడ్లు, బీసీలు లేరా..

- #PawanKalyan#JanaseanParty #Telangana #AndhraPradesh #TeluguNews #Tupaki

Follow 👉 @tupaki_official pic.twitter.com/WVl91YkaMS

— Tupaki (@tupaki_official) June 2, 2026


Tags:    
  • pawankalyan 
  • janasena 
  • telangana 
  • telanganapolitics 
  • congress 
  • revanthreddy 
  • brs 
  • bjp 
  • 2028elections 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS