పవన్ లెఫ్ట్ నా రైట్ నా... నో కన్ఫ్యూజన్ !
జనసేన కులం మతం ప్రాంతం వర్గం వర్ణం ఇలాంటిది ఏదీ చూడదని పవన్ అన్నారు న్యాయం వైపు మాత్రమే నిలబడుతుందని ఆపన్నులకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు.;
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనది ఏ పొలిటికల్ ఫిలాసఫీ అంటే ప్రత్యర్ధులు రాజకీయ విమర్శలు చేసే అతి పెద్ద ఫిర్యాదు ఏంటి అంటే అయోమయం విధానం అని. జనసేన పొత్తు పెట్టుకోని పార్టీ అన్నది లేదు కాబట్టి ఆ పార్టీ విధానాలలో నిలకడ లేదని ప్రత్యర్ధులు అంటారు. అయితే అది తప్పు అంటున్నారు జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన తెలంగాణాకు చెందిన జనసేన నేతల సమావేశంలో ఈ విషయం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేనది బలమైన రాజకీయ సిద్ధాంతం అన్నారు. అది ప్రత్యర్ధులకు అర్ధం కాదని అందుకే వారే కన్ఫ్యూజన్ లో ఎపుడూ ఉంటారని సెటైర్లు వేశారు.
న్యాయం వైపుగా :
జనసేన కులం మతం ప్రాంతం వర్గం వర్ణం ఇలాంటిది ఏదీ చూడదని పవన్ అన్నారు న్యాయం వైపు మాత్రమే నిలబడుతుందని ఆపన్నులకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో తమది క్లియర్ కట్ పొలిటికల్ ఫిలాసఫీ అని నొక్కి వక్కాణించారు. సమస్యను సమస్యగానే చూడాలన్నది జనసేన అభిమతం అన్నారు. మధ్యలోకి ఎందుకు ఇతర అంశాలను తీసుకుని రావాలని అంటూ ఆయన ప్రశ్నించారు.
హిందూత్వం గురించి :
ఇక తాను హిందూత్వం గురించి మాట్లాడినంత మాత్రాన ఇస్లాం కి వ్యతిరేకిని కాను అని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎంతో మంది ఆ వర్గంలో అభిమానులు ఉన్నారని అన్నారు. ఇక తాను ఏపీలో పాలన చేస్తున్నా తెలంగాణా అంటే కూడా అంతే ఇష్టం అని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి రాకముందే తెలంగాణా భాష యాస సాహిత్యం పట్ల ఎంతో మక్కువ ఉందని ఆయన చెప్పుకున్నారు. తన సినిమాలలలో పాటలను డైలాగులను పెట్టించాను అంటే ఓట్ల కోసమా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు తాను రాజకీయాల్లో కూడా లేనని తనకు రాజకీయమే తెలియదు అని అన్నారు. అయినా తెలంగాణా గడ్డ అంటే ప్రత్యేక అభిమానంతోనే అలా చేశాను అని చెప్పారు.
ఎంతో ఇచ్చిందంటూ :
ఇక తనకు తెలంగాణాలో ఎంతో మంది అభిమానులు ఉన్నారని వారంతా నిస్వార్ధంగా తన కోసం ఎంతో చేశారని తన సినిమాలు ఆదరించారని పవన్ చెప్పారు. అలా తెలంగాణా గడ్డ తనకు ఎంతో ఇచ్చిందని తాను ఏమి ఇవ్వగలను అని ఆయన అన్నారు. ఏపీలో మంచి పాలన అందిస్తున్నామని ఆయన అంటూ తెలంగాణా అంటే అదే అభిమానం ఉందని మాత్రమే చెప్పారు. మరి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేస్తున్నారా అక్కడ కార్యక్రమాలు ఏమిటి చేయబోతున్నారు అజెండా ఏమిటి అన్నది మాత్రం ఆయన స్పష్ట అయితే ఇవ్వలేదు కానీ తెలంగాణాలో పార్టీకి అన్ని విధాలుగా భరోసా అయితే ఇచ్చారు. మరి రానున్న కాలంలో ఆయన తెలంగాణాలో పార్టీ విస్తరణకు ఏమైనా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారేమో చూడాల్సి ఉందని అంటున్నారు.