• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ పై జైశంకర్ ...

ట్రంప్ పై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు... మోడీతో బంధంపై కీలక వ్యాఖ్యలు!

| ఇప్పటికే పలు దేశాలకు సుంకాలతో షాకిచ్చిన ట్రంప్.. భారత్ ను ఆ జాబితాలో పెట్టినట్లు చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 13:50 GMT

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్ తో అమెరికా బంధంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా హెచ్-1బీ వీసాలు, స్టూడెంట్ వీసాల సంగతి ఒకెత్తు అయితే.. సుంకాల సంగతి మరొకెత్తు అన్నట్లుగా ఉంది. ఇప్పటికే పలు దేశాలకు సుంకాలతో షాకిచ్చిన ట్రంప్.. భారత్ ను ఆ జాబితాలో పెట్టినట్లు చెబుతున్నారు.

ఇలా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాలో కంటే ఎక్కువగా అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారత్ లో విపరీతమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్సరాజ్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ట్రంప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విదేశాంగమంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఇటీవల జరిగిన ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన విషయాన్ని ప్రస్థావించిన ఆయన.. అక్కడ మనకు ఎంతో గౌరవం లభించిందని అన్నారు. ఈ అసందర్భంగా ట్రంప్ ఒక జాతీయవాది అని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.

భారత్ కు ట్రంప్ మిత్రుడా..? శత్రువా..? అనే ప్రశ్నకు సమాధనంగా స్పందించిన ఆయన.. ఈ విధంగా స్పందించారు. ఇదే సమయంలో... ట్రంప్ విధానాలతో ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలున్నప్పటికీ.. భారత్ మాత్రం దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందని.. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రభావం పెరుగుతోందని అన్నారు.

ప్రధానంగా... అమెరికాతో భారత్ బంధం బలంగా ఉందని చెప్పిన జై శంకర్.. ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ తో మంచి స్నేహం ఉందని వెల్లడించారు. ఇక చాలా మంది భారతీయేతరులు తమను తాము ఇండియన్స్ గా పరిచయం చేసుకుంటున్నారని.. ఇది విమానాల్లోనో, మరోచోటో తమకు సీటు దక్కేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... తన వ్యక్తిగత విషయాలనూ పంచుకున్న జై శంకర్... తాను ఒక బ్యూరోక్రాట్ అవుతానని అనుకోలేదని అన్నారు. తన రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగిందని.. ఇది అంతా అదృష్టం అని అనుకోవడమే అని.. అదంతా నరేంద్ర మోడీ వల్లే జరిగిందని గుర్తుచేసుకున్నారు.

కాగా.. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారకార్యక్రమానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటలోపే మార్కో రూబియోతో భేటీ అయ్యారు.

Tags:    
  • SJaishankar 
  • DonaldTrump 
  • UsIndiarelations 
  • H1Bvisa 
  • Tariffs 
  • IndiaUsbond 
  • ModiTrumpfriendship 
  • Jaishankarspeech 
  • Indiaglobalinfluence 
  • USpresidentialinauguration 
  • Diplomaticcomments 

Similar News

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS