బీఆర్ఎస్, కాంగ్రెస్ లను వీడినా బీఎస్పీ కరుణించలే !

దీంతో అనూహ్యంగా ఆయన పోటీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-04-27 03:00 GMT

నాగర్ కర్నూలు లోక్ సభ స్థానానికి బీఎస్పీ పార్టీ తరపున పోటీకి దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాధ్ కు ఊహించని షాక్ తగిలింది. బీఎస్పీ తరపున ఆయన దాఖలు చేసిన నామినేషన్ పార్టీ బీఫాం లేనందున ఈ రోజు జరిగిన నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఎన్నిక అధికారి తిరస్కరించారు. దీంతో అనూహ్యంగా ఆయన పోటీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీఆర్ఎస్ తరపున 2014లో ఎంపీగా ఓడిపోయిన ఆయనకు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి వరించింది. 2019లోనూ ఎంపీ పదవి ఇవ్వకుండా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికే పరిమితం చేయడం, తన కుమారుడికి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరాడు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ అధినేత మాయావతిని రాజస్థాన్ పర్యటనలో కలిసి కండువా కప్పుకున్నాడు. కానీ ఆ పార్టీ బీఫాం అందకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురయింది.

1996లో తెలుగుదేశం పార్టీ తరపున నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిన ఆయన తొలిసారి గెలిచాడు. ఆ తర్వాత 1999లో, 2004లో టీడీపీ నుండి వరసగా గెలిచాడు. 2008లో పార్టీ విప్ కు విరుద్దంగా పార్లమెంట్ సో ఓటు వేయడంతో స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ బహిష్కరించారు. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచాడు. 2013,- బీఆర్ఎస్ లో చేరి 2014 ఎన్నికలలో ఎంపీగా ఓడిపోయాడు. నాలుగు సార్లు నాగర్ కర్నూలు ఎంపీగా వరసగా గెలిచిన మందా నామినేషన్ తిరస్కరణకు గురికావడం చర్చానీయాంశం అయింది.

Tags:    

Similar News