వైరల్ పిక్... లండన్ లో ల్యాండ్ అయిన సీఎం జగన్!

ఈ సమయంలో వైఎస్ జగన్ తన మార్కు డ్రెస్.. వైట్ కలర్ షర్ట్, ఖాకీ కలర్ ఫ్యాంట్ లోనే కనిపించారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Update: 2024-05-18 07:13 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు రెండు వారాల విరామం దొరికింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు జగన్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి విజయవాడ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ నేతలు జగన్ కు సెండాఫ్ ఇచ్చారు!

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా లండన్ ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ నెంబర్ 5 నుంచి జగన్ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అత్యంత హుషారుగా.. చిరునవ్వులు చిందిస్తూ జగన్ బయటకు వస్తున్నారు.

ఈ సమయంలో వైఎస్ జగన్ తన మార్కు డ్రెస్.. వైట్ కలర్ షర్ట్, ఖాకీ కలర్ ఫ్యాంట్ లోనే కనిపించారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే గతంలో జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జీన్స్ ధరించి స్టైలిష్ గా ఉన్న ఫోటోలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఏపీ సీఎం జగన్ వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు!

కాగా... పోలింగ్ అయిన మూడు రోజుల తర్వాత ఐప్యాక్ ఆఫీసులో తొలిసారి చిరునవ్వుతో కనిపించిన వైఎస్ జగన్... గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో ఈసారి గెలవబోతున్నామనే ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో... జగన్ అంత నమ్మకంగా చెబుతున్నారంటే... నెంబర్స్ మారినా ప్రభుత్వ ఏర్పాటు మాత్రం కన్ఫాం అని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News