వైఎస్సార్ బిడ్డలు మరీ ఇంతలా మారిపోయారా..!
అవును... వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అనే సంగతి తెలిసిందే.;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. అందులో ఒకరు విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మాజీగా ఉన్నారు. మరొకరు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అది ఏ స్థాయిలో ఉందంటే అనే విషయంపై మరోసారి చర్చ మొదలైంది.
అవును... వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అనే సంగతి తెలిసిందే. వాస్తవానికి 2019 వరకూ వీరిద్దరి మధ్య చాలా సన్నిహిత బంధమే ఉంది. రాఖీ పండక్కు ఎక్కడ ఉన్నా షర్మిల అన్న ముందు వాలిపోయేవారు! ఇక.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున షర్మిల ప్రచారానికి నాయకత్వం వహించారు.. అన్న జైల్లో ఉంటే ఆమె పాదయాత్ర చేశారు.
ఈ క్రమంలో 2019లో వైసీపీ 151 సీట్లు సాధించి రికార్డ్ విక్టరీ సాధించడంలో ఆమె పాత్రనూ చాలామంది పరిగణలోకి తీసుకుంటారు. కట్ చేస్తే.. సరస్వతి పవర్ ప్లాంట్, ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అన్నాచెల్లి మధ్య సమస్యలు మొదలయ్యాయి! పెద్దమనుషులు, కుటుంబ సభ్యుల మధ్య సమిసిపోవాల్సిన సమస్య కాస్తా కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి. దీంతో.. గ్యాప్ మరింత పెరిగింది!
ఈ ఉపోద్గాతమంతా ఎందుకంటే... డిసెంబర్ 17న షర్మిల తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే.. జగన్ నుంచి మాత్రం ఆమెకు విషెస్ అందలేదు.
ఇప్పుడు ఈ కారణంగానే వైఎస్సార్ సంతానం విషయంలో మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి షర్మిల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జగన్ శుభాకాంక్షలు తెలిపి చాలాకాలం అయ్యింది. అందుకు ఏమాత్రం తక్కువకాదు అన్నట్లుగా... జగన్ బర్త్ డేకి కానీ, రాఖీ పండక్కి గానీ షర్మిల నుంచి స్పందన లేని పరిస్థితి. దీంతో... వైఎస్సార్ బిడ్డలు మరీ ఇంతలా మారిపోయార అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.