జగన్... ఆ టాపిక్ మాట్లాడకుండా ఉంటే అధికారంలోకి వస్తావ్ !

అవున్నా ఇదే నిజమా. ఇంతకీ జగన్ ఏ టాపిక్ మీద అసలు మాట్లాడకూడదు ఆయన పూర్తిగా పక్కన పెట్టాల్సిన టాపిక్ ఏమిటి అంటే అదే అసలైన విషయంగా ఉంది.;

Update: 2026-01-22 13:30 GMT

అవున్నా ఇదే నిజమా. ఇంతకీ జగన్ ఏ టాపిక్ మీద అసలు మాట్లాడకూడదు ఆయన పూర్తిగా పక్కన పెట్టాల్సిన టాపిక్ ఏమిటి అంటే అదే అసలైన విషయంగా ఉంది. భూములు రీ సర్వే గురించి జగన్ మాట్లాడటం ఎంత తగ్గిస్తే అంత మంచింది అని సూచనలు వస్తున్నాయి. నిజంగా వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేసి పాతాళంలోకి తొక్కేసింది ఈ భూ సర్వే విషయమే అని అంటున్నారు. భూముల రీ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన హడావుడి ఒక ఎత్తు అయితే చేసిన మరో పొరపాటు కూడా ఉంది. అదే వైసీపీని నిలువునా ఓడించింది అని అంటున్నారు.

జగన్ ఫోటోతోనే :

నిజానికి భూముల రీ సర్వే చేయడంలో తప్పు లేదు, భూ సమస్యలు తీర్చి లోపాలు సవరించి పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందించాలన్న వైసీపీ ప్రభుత్వం ప్రయత్నంలోనూ తప్పు లేదు, కానీ వైసీపీ చేసిన ఆర్భాటంతోనే తేడా కొట్టేసింది అని అంటున్నారు. భూ సర్వే రాళ్ళ మీద జగన్ పేరు వేసుకున్నారు. అంతే కాదు రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద కూడా జగన్ ఫోటో వేశారు. అలా చేయవచ్చా కూడదా అన్నది కూడా ఎవరూ ఆలోచించనేలేదు, పబ్లిసిటీని పీక్స్ కి చేర్చే క్రమంలో చేసిన ఈ రకమైన విన్యాసాల మూలంగానే వైసీపీ హయాంలో భూముల రీ సర్వే అంటే అందరిలోనూ భయం ఏర్పడింది అని అంటున్నారు.

వైసీపీ వారే నమ్మలేదు :

ఈ నేపధ్యంలో వైసీపీ క్యాడరే భయపడిపోయి ఓట్లు వేయలేదు అన్న ప్రచారం కూడా సాగింది. మీ భూములు మీవి కావు, జగన్ తీసుకుంటాడు అని ఈ విషయం మీద టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక టీడీపీ మీడియా కూడా బలంగా జనంలోకి తీసుకుని వెళ్లింది మ్యాటర్ ఈ విధంగా ఉంటే భూముల రీ సర్వే క్రెడిట్ అంటూ జగన్ ఆ టాపిక్ ఎత్తుకోవడం వల్ల ఇబ్బందులే వస్తాయని అంటున్నారు.

బూమరాంగ్ అయింది :

భూముల రీ సర్వే మా హయాంలోనే చేశామని తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఏకంగా 40 వేల మందితో సమగ్ర భూ సర్వే చేయించామని ఆయన అన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో దీని మీద ఒప్పందం చేసుకున్నామని హెలికాప్టర్లు డ్రోన్లు ఉపయోగించారు అని ఆయన చెప్పారు. రైతులకు తాము చేసిన మేలు ఏ ప్రభుత్వమూ చేయలేదని జగన్ అన్నారు. ఇలా భూ సర్వే క్రెడిట్ తమదే అని జగన్ చెప్పుకోవడం అయితే ఈ సమయంలో బామరాంగ్ అవుతుందని అంటున్నారు.

వెంటాడుతున్న వైనం :

జగన్ మీ భూములు తీసుకుంటారు, అందుకే సర్వే రాళ్ల మీద ఆయన పేరు, రిజిస్ట్రేషన్ పత్రాల మీద ఆయన ఫోటో వేసుకున్నారు అని గతంలో టీడీపీ ప్రచారం చేసింది. ఇపుడు మళ్ళీ భూ సర్వే మా క్రెడిట్ అని జగన్ అన్నా వైసీపీ గట్టిగా వాదించినా పాత విషయాలను తవ్వి తీసి కౌంటర్ ఎటాక్ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. అందువల్ల వైసీపీ ఈ విషయాన్ని వదిలేయడమే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి. ఆ టాపిక్ ఎత్తుకుంటే కనుక గతంలో వైసీపీ మీద చేసిన విమర్శలు మళ్ళీ తిరగతోడతారు అని అంటున్నారు.

వైసీపీ బుక్ అయింది :

మరి వైసీపీ అధినేత అయితే ఈ విషయాన్ని ఎంచుకుని టీడీపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే అనేక జిల్లాలలో రీ సర్వే చేసిన పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ సాగుతోంది. ఇక ఈ మధ్యనే గోదావరి జిల్లాలలో నిర్వహించిన మీటింగులో కూడా చంద్రబాబు జగన్ మీ భూములను తీసుకోవాలని అనుకున్నారని విమర్శలు చేశారు. వాటిని మేము సరి చేశామని కూడా చెప్పారు. మరి భూ సర్వే విషయంలో అయితే వైసీపీ బాగా బుక్ అయిందన్న మాటే ఉంది.

Tags:    

Similar News