• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీనియర్లకు గ్రీన్ సిగ్నల్...

సీనియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న జగన్!

| ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లను వారి అనుభవాలను వాడుకుంటూనే కొత్త వారికి యంగ్ లీడర్స్ కి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు

By - Tupaki Desk
Update: 2024-12-23 03:44 GMT

వైసీపీ అధినేత జగన్ తన రాజకీయ వ్యూహాలను మారుస్తున్నారు. 2027లో ఎన్నికలు జరిగినా లేక 2029లో జరిగినా కూడా కొత్త టీం తోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లను వారి అనుభవాలను వాడుకుంటూనే కొత్త వారికి యంగ్ లీడర్స్ కి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు

ఆ విధంగా సీనియర్ నేతలు కూడా జగన్ కి వినతి చేస్తున్నారు అని అంటున్నారు. తమ వారసులకు టికెట్ ఇస్తే తాము వెనక ఉండి రాజకీయ శిక్షణ ఇస్తామని గెలిపించుకుంటామని చెబుతున్నారు. నిజానికి 2024లోనే ఇదంతా జరగాలి. కానీ జగన్ ఒప్పుకోలేదు. ఇపుడు అది సాకారం అవుతోంది అంటున్నారు.

శ్రీకాకుళం నుంచే దానికి శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు. ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను రంగంలోకి దించుతారు అని అంటున్నారు. దానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. శ్రీకాకుళం సీటులో ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు రాం మనోహర్ నాయుడిని ముందుకు తెస్తున్నారు.

అలాగే నరసన్నపేట నుంచి తన కుమారుడు క్రిష్ణ చైతన్యను ధర్మాన క్రిష్ణ దాస్ ముందుకు తెస్తున్నారు. వీరికే పార్టీ బాధ్యతలు తొందరలో అప్పగిస్తారు అని అంటున్నారు. అలాగే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని రంగంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుమారుడికి చీపురుపల్లి బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణికి ఇన్చార్జి బాధ్యతలు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది.

అలాగే బొబ్బిలి, సాలూరులలో కూడా కొత్త ముఖాలను తెస్తారని అంటున్నారు. విశాఖలో చూసినా సీనియర్ నేతల స్థానంలో కొత్త వారికి లేదా వారసులకు అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే సీనియర్లు పార్టీ కోసం పనిచేయాలని అధినాయకత్వం సూచించే అవకాశం ఉంది అని అంటున్నారు

అందుకే భూమన కరుణాకరరెడ్డి, పేర్ని నాని వంటి వారు గట్టిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విధంగా మరింత మంది సీనియర్ నేతలకు కూడా వారసుల విషయంలో గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బలంగా సీనియర్లు ఉన్న చోట వారసులను దించడం, లేని చోట కొత్త వారికి చాన్స్ ఇవ్వడం ద్వారా వైసీపీ పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించాలని చూస్తోంది అంటున్నారు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Appolitics 
  • Ysjagan 
  • YCP 
  • Ycpleaders 
  • Ycpseniors 
  • Perninani 
  • Ycpparty 
  • Krishnachaitanya 
  • Tamminenisitaram 
  • Politicalnews 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS