• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాలో ప్రాబ్లం ఉందంటూ జగన్...

నాలో ప్రాబ్లం ఉందంటూ జగన్ సంచలనం!

| ఆఖరుకు జగన్ కూడా ఈ ఘోర పరాజయాన్ని నెత్తిన పెట్టుకోలేకపోతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-12-05 19:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన దిశగా అడుగులు వేస్తున్నారా అంటే దానికి జవాబు కాలమే చెప్పాలి. ఎందుకంటే విజయం ఎపుడూ అందరిది. అపజయం ఒంటరిది. అనాధగా ఉంటుంది. వైసీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయం సాధించిన నాడు అది తమ ఘనతే అని అంతా చెప్పుకున్నారు. కానీ ఓటమిని మాత్రం ఎవరూ భుజాన వేయలేకపోతున్నారు.

ఆఖరుకు జగన్ కూడా ఈ ఘోర పరాజయాన్ని నెత్తిన పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఓడామన్నది తెలియడం లేదని వైసీపీ నేతలు సైతం తల్లడిల్లుతున్నారు. అయితే విజయానికి ఒక్కటే కారణం ఉండొచ్చు కానీ పరాజయానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వెతికి పట్టుకుంటే కచ్చితంగా అవి దొరుకుతాయి.

మరి వైసీపీ అధినేత ఆ పరాజయానికి సంబంధించిన కారణాలు వెతికి పట్టుకున్నారా అంటే పట్టుకున్నారు. అయిత అవి పాజిటివ్ వేలోనే అని కూడా అంటున్నారు. తనలోని అతి మంచి తనం అతి నిజాయతీ ఈ రెండూ పెద్ద ప్రాబ్లంస్ అని జగన్ చెబుతున్నారు. వాటి వల్లనే తాను 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యానని ఆయన చెబుతున్నారు.

అంటే ఇది ఓటమిని అంగీకరించడమే కానీ అది పూర్తి స్థాయిలో ఆత్మ పరిశీలన అవుతుందా అన్న చర్చ సాగుతోంది. అతి మంచితనం అతి నిజాయతీ అన్నవి పాజిటివ్ విషయాలే. అలా తన పాజిటివిటీని చెప్పుకుంటూ జగన్ ఓటమి చెందామని అంటున్నారు. అయితే ఈ రెండూ ఎంతో కొంత పాత్ర వహించవచ్చు కానీ అత్యధికమైన కారణాలు ఇంకా ఉన్నాయని అంటున్నారు.

అవేంటి అంటే క్యాడర్ ని పక్కన పెట్టడం, పార్టీని పూర్తిగా గాలికి వదిలేయడం. కొందరినే నమ్ముకుని తాడేపల్లిలో నాలుగు గోడల మధ్యన ఉండిపోవడం, ఎదుటి పక్షం వ్యూహాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, తమ మీద అతి ధీమా, ఎదుటి పక్షం మీద పూర్తిగా తేలిక భావం, పార్టీలో అంతా తానే అన్న భావన. తనను చూసే జనాలు ఓటు చేస్తారు అన్న ఆలోచనలు ఇలా ఎన్నో పార్టీ పరంగా ఉన్నాయి.

ప్రభుత్వ పరంగా చూస్తే కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం అభివృద్ధిని అయిదేళ్ల విలువలైన కాలంలో ఇదీ అని చూపించలేకపోవడం, అప్పులు ఎక్కువ చేశారా తక్కువ చేశారా అన్నది పక్కన పెడితే సంపద మాత్రం సృష్టించలేకపోయారు అన్న విమర్శలు ఎదుర్కోవడం ఇలా చెప్పుకుంటే రామకోటి మాదిరిగానే ఉన్నాయి.

అయితే జగన్ బయటకు అంగీకరించకపోయినా చెప్పకపోయినా కూడా ఆచరణలో చూపిస్తున్న విషయం అయితే ఒకటి ఉంది. అదే క్యాడర్ తో మమేకం కావాలని నిర్ణయించడం. సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తాను అని ప్రతీ బుధ,గురు వారాలు రెండు రోజుల పాటు జిల్లాలలోనే బస చేస్తాను అని ప్రతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ ని పిలిచి వారి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలుసుకుంటానని చెప్పడం.

నిజానికి ఇదే వైసీపీకి కావాల్సింది. ఈ విషయం వల్లనే వైసీపీ ఓడింది. దానిని సరిచూసుకునే పనిలో వైసీపీ ఉంది. వైసీపీకి ప్రాబ్లం కూడా ఇదే. కానీ అతి మంచితనం అతి నిజాయతీ అని జగన్ చెబుతున్న దాని కంటే కూడా దీని వల్లనే పార్టీ ఓడింది అని అంతా విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ కూడా క్యాడర్ తో మమేకం అంటున్నారు. మొత్తానికి జగన్ కార్యకర్తల జపం చేస్తున్నారని ఇది మంచి కోసమే అని వైసీపీలో చర్చ అయితే సాగుతోంది.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Jaganmohanreddy 
  • Chandrababu 
  • Apcm 
  • Pawankalyan 
  • Deputycm 
  • Ycpleaders 

Similar News

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS