జ‌గ‌న్ వ‌ర్సెస్ 'జెన్‌ -Z'.. స్ట్రాట‌జీ పెద్ద‌దేనా?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 'జెన్‌ -Z' అంటూ... విద్యార్థుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీ య వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది.;

Update: 2025-11-07 05:29 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 'జెన్‌ -Z' అంటూ... విద్యార్థుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీ య వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. విద్యార్థుల‌ను వైసీపీవైపు మ‌ళ్లించేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌న్న వాద‌నా వినిపిస్తోంది. ''మంచి రాజకీయ భవిష్యత్ కు విద్యార్థి దశలోనే భీజం పడుతుంది'' అని జగన్ వ్యాఖ్యానించ‌డం వెనుక‌.. ప‌క్కా వ్యూహం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీ పీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్ధి విభాగం నాయకులతో సమావేశమైన జ‌గ‌న్‌.. విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్, మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పాఠ శాలలు స‌హా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. విద్యార్థి విభాగం నేత లంతా జెన్‌ -Z తరంలో ఉన్నారని, భావి తరానికి దిక్సూచీల‌ని చెప్పారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.

సమాజంలో విద్యార్థులుగా తమ పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ తీసుకు వచ్చింది వైయస్సార్‌సీపీ ప్రభుత్వమేన‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న ప‌లు ప‌థ‌కాల అమ‌లును కూడా ప్ర‌స్తావించారు. 'విద్యాదీవెన' ఒకే ఒక్క పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు. ఇక‌, వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చినట్లు వివరించా రు. ఇవాళ అన్నింటినీ ధ్వంస చేస్తున్నారని విమ‌ర్శించారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో 'జెన్‌ -Z' నేత‌ల‌ను ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో విస్తృతంగా పాల్గొనేలా ప్రోత్స హించ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. విద్యార్థి విభాగం పాత్ర‌ను మ‌రింత పెంచే వ్యూ హం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి గ‌తంలో ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు అయితే చేయ‌లేదు. కానీ.. రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జెన్‌ -Z పాత్ర‌ను పెంచేలా.. ప్రోత్స‌హించేలా అడుగులు వేస్తున్నార‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇదిలావుంటే.. విశాఖ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్ర‌గ్స్ రవాణా కేసులో చిక్కుకున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News