ఇది ఇప్పటి ప్లాన్ కాదు... మొస్సాద్ మామూలు వ్యవస్థ కాదు!
తాజాగా హమాస్ ఉగ్రవాదులను నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై జరుపుతున్న దాడులే అందుకు ఉదాహరణ అని చెపుతారు.;
పశ్చిమాసియాలో వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. భూమిపై బాంబులు, ఆకాశంలో డ్రోన్లతో భీకర యుద్ధం మొదలైంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం మొస్సాద్ వ్యూహ చతురత, ప్రదర్శన, లక్ష్యాలను ఎంచుకునే విషయంలో వేసుకునే పక్కా ప్రణాళికలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో... ఇరాన్ లోనే మొస్సాద్ రహస్య డ్రోన్ స్థావరం ఉందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... పశ్చిమాసియాలో ప్రత్యర్థులను పూర్తిగా నాశనం చేసే వరకూ ఇజ్రాయెల్ శాంతించదని అంటారు. తాజాగా హమాస్ ఉగ్రవాదులను నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై జరుపుతున్న దాడులే అందుకు ఉదాహరణ అని చెపుతారు. ఇప్పుడు టాక్స్ ఇరాన్ ని నాశనం చేయడం.. లేదా, అణు ఒప్పందానికి ఒప్పించడం లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మొస్సాద్ వ్యూహ చతురత ఆసక్తిగా మారింది.
తాజాగా ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అవిరామంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని మొస్సాద్ భారీగా, పక్కాగా ప్లాన్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం ఎప్పటినుంచో ఇరాన్ లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుంది!
తాము చేపట్టబోయే ఆపరేషన్ కోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్ లోకి చేరవేసి, అక్కడే ఓ రహస్య స్థావారాన్ని ఏర్పాటు చేసుకుందంటం ఇజ్రాయెల్ సైన్యం. ఈ విషయంలో ఆ దేశ గూఢచర్య విభాగం మొస్సాద్ కీలకపాత్ర నిర్వహించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
ఈ క్రమంలో... సరిగ్గా ఆపరేషన్ రైజింగ్ లయన్ స్టార్ట్ అవ్వగానే ఇరాన్ లోనే ఉన్న రహస్య స్థావరాల నుంచి ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది. ఆ తర్వాత యుద్ధ విమానాలు, క్షిపణులతో.. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాలపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ సందర్భంగా.. ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫ్ఫే డెఫ్రిన్ కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ వాయుసేనలోని ఫైటర్ జెట్లు, రీఫ్యూయలర్లు, నిఘా వంటి వివిధ రకాలకు చెందిన 200 యుద్ధ విమానాల దండు ఇరాన్ పైకి వెళ్లిందని.. మొత్తం 100 టార్గెట్లపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులను వాడినట్లు వివరించారు.