ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి... చైనాకు తీవ్ర గాయం ఎలాగంటే..?
ఈ సమయంలో.. ఇరాన్ దేశ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన 'ది సౌత్ పార్స్' క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడం చైనాకు దెబ్బ అని అంటున్నారు.;
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావారణం తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో టెహ్రాన్ లోని పలు ప్రాంతాల్లోనూ.. టెల్ అవీవ్ లోనూ పేలుళ్లు సంభవించాయి. ఈ సమయంలో.. ఈ ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం పలు ఆసియాదేశాలపై పెను ప్రభావం చూపించొచ్చని అంటున్నారు. ఈ సమయంలో చైనాకు బిగ్ షాక్ తగిలింది!
అవును... ప్రస్తుతం ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మనుగడను, ఆధిపత్యాన్ని ప్రశ్నార్థకం చేసే యుద్ధంగా భావిస్తున్న ఈ పోరాటంలో అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో.. ఇరాన్ దేశ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన 'ది సౌత్ పార్స్' క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడం చైనాకు దెబ్బ అని అంటున్నారు.
వాస్తవానికి "ది సౌత్ పార్స్" అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. ఇది ధ్వంసమైనట్లు ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. ఇందులోని 11 గ్యాస్ నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయని వెల్లడించారు. ఈ గ్యాస్ క్షేత్రాలు ఇరాన్ కు ఆర్థికంగా అత్యంత కీలకమైన వాటిలో ఒకటి.
ఈ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ స్టేషన్ లలో ఒకటైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసి, దాన్ని ధ్వంసం చేయడంతో ఇది చైనాకు భారీ ఎదురుదెబ్బ అని అంటున్నారు. ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్ లో సుమారు 80% చైనా చౌక ధరకే కొనుగోలు చేస్తుందని అంటారు. ఇదే సమయంలో... ఎల్.ఎన్.జీ ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ఒకటి.
దీంతో... దిగుమతులు నిలిచిపోతే చైనా రిఫైనరీలు దివాళా తీసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ది సౌత్ పార్స్ పై ఇజ్రాయెల్ చేసిన దాడితో ఇరాన్ తో పాటు అంతకంటే ఎక్కువగా చైనాకు గాయమైందని చెబుతున్నారు.