• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ వార్నింగ్.....

ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్ కు 'హైపర్' సోనిక్ మిస్సైల్ తో రిప్లై పంపిన ఇరాన్!

| అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోమని వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకు ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి ఎక్స్ వేదికగా రిప్లై వచ్చిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-18 10:05 GMT

సోకాల్డ్ సుప్రీం లీడర్ (ఖమేనీ) ని చంపడం పెద్ద పనేమీ కాదని.. బేషరతుగా లొంగిపోవాలని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకు ఇరాన్ నుంచి 'ఎక్స్' వేదికగానే కాకుండా.. వార్ ఫీల్డ్ లోనూ సమాధానం వచ్చేసింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై వ్యూహాత్మకంగా దాడి చేస్తోన్న ఇరాన్.. బుధవారం తెల్లవారుజామున రెచ్చిపోయింది. హైపర్ సోనిక్ క్షిపణులతో విరుచుకుపడింది.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేషరతుగా లొంగిపోమని వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకు ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి ఎక్స్ వేదికగా రిప్లై వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జాల్ఫికర్ తో కలిసి ఖైబర్ కు వచ్చేశారు" అని అందులో రాశారు. దీంతోపాటు ఖడ్గం చేతబట్టి కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జతచేశారు.

ఇలా "యుద్ధం మొదలైంది" అనే రిప్లై ను మాటల్లో ఇచ్చిన ఇరాన్... బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ పై చేతల్లోనూ సమాధానం ఇచ్చేసింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ లో 10 చోట్ల హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ ఓ ప్రకటనలో ధృవీకరించింది. దీంతో... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి.

ఇజ్రాయెల్ లోని 10 లక్ష్యాలపై ఫతాహ్-1 హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన్... 'ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ - 3'లో 11వ దశ కొనసాగుతోందని వెల్లడించింది. ఇదే సమయంలో ఆక్రమిత భూభాగాల గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ప్రకటించింది. ట్రంప్ వార్నింగ్ అనంతరం "యుద్ధం మొదలైంది" అని ఖమేనీ ప్రకటించిన అనంతరం ఇరాన్ ఈ దాడి చేసింది.

దీంతో... ఇజ్రాయెల్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా.. సెంట్రల్ ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరాల్లో అలర్ట్ జారీ చేసింది. మిస్సైళ్ల దాడి జరుగుతున్నందున ప్రజలు తక్షణమే ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది.

కాగా... ఇరాన్ వద్ద ఉండే అత్యంత పవర్ ఫుల్ ఆయుధాల్లో ఈ ఫతాహ్-1 హైపర్ సోనిక్ మిస్సైల్ ఒకటి. ధ్వని కంటే సుమారు 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే ఈ క్షిపణి.. 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. అది కూడా 4 నిమిషాల్లోనే కావడం గమనార్హం!  

Iran launches Hypersonic Fattah-1 with Mach 13 speed and a range of 1400km.

It reached the target in 5 min and whizzed past Israel's defense systems and took out the target. Spectacular impact.#IranIsraelConflict #Iran #Israel #IsraeliranWar #IsraelIranConflict #IranIsrael pic.twitter.com/NaeJfHnPIJ

— Muhammad Hasnain Shah (@ahsankazmi2) June 18, 2025
Tags:    
  • IranIsraelConflict 
  • HyperSonicMissiles 
  • MiddleEastTensions 
  • KhameneiResponse 
  • TrumpWarning 
  • MilitaryStrike 
  • BallisticMissiles 
  • OperationHonestPromise 
  • IsraelAlert 
  • GlobalSecurity 
  • IsraelIranWar 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS