• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రతీ ఇంటి తలుపు...

ప్రతీ ఇంటి తలుపు తట్టనున్న టీడీపీ

| ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ని కూడా తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం పనితీరు గురించి వారిని వివరిస్తారు.

By - Tupaki Desk
Update: 2025-06-13 20:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇక ప్రతీ ఇంటి తలుపూ తట్టబోతోంది. ప్రతీ కుటుంబీకులను పలకరించబోతోంది. దానికి సందర్భం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అలాగే సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టామని టీడీపీ ప్రతి ఇంటికీ తిరిగి చెప్పబోతోంది. కార్యకర్తలు నాయకులు అంతా కలసి ప్రతీ ఇంటినీ సందర్శించి ప్రభుత్వ పాలన గురించి వివరిస్తారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ నాయకులు వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ని కూడా తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం పనితీరు గురించి వారిని వివరిస్తారు. వారు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో వాకబు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇక దీనిని విజయ యాత్రగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విజయయాత్రలో పార్టీ నాయకులు అంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చంద్రబాబు కోరారు. ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో అనేక విషయాలు పంచుకున్నారు. కార్యకర్తలు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

ప్రభుత్వం ఏడాది కాలంలో సుపరిపాలన అందించింది అని దానిని ప్రజల ముందు పెట్టాలని బాబు కోరారు. అంతే కాదు, పార్టీని మరింత పటిష్టంగా ఎక్కడికక్కడ చేయాలని కోరారు. నాయకులు ప్రజా ప్రతినిధులు పార్టీ అంతా తీరిక చేసుకుని ప్రతీ సందర్భంలో కార్యకర్తలను కలవాలని వారి మంచి చెడులు చూడాలని కోరారు.

అదే విధంగా జూలై నెలలో పార్టీ క్యాడర్ కి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ శిక్షణా తరగతులలో చురుకైన వారిని ఎంపిక చేసి వారి నుంచి మంచి నాయకులను తయారు చేస్తామని బాబు చెప్పారు. పార్టీ అధికారంలో లేనపుడు పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అని వారిని ఎట్టి పరిస్థితులో విస్మరించేది లేదని బాబు హామీ ఇచ్చారు.

అదే సమయంలో పార్టీ ప్రభుత్వం రెండూ కో ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలని బాబు కోరారు. అందరికీ తగిన సమయంలో అవకాశాలు వస్తాయని అన్నారు. అలాగే పార్టీ పదవులు కూడా పనిచేసేవారికే ఇస్తామని బాబు చెప్పారు. మొత్తానికి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టబోతోంది అన్న మాట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టింది. అయితే అందులో క్యాడర్ లీడర్ పెద్దగా భాగస్వామ్యం కాలేదని చెబుతారు. అందుకే ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దాంతో టీడీపీ ఇపుడు క్యాడర్ ని లీడర్ ని ముందు పెట్టి ఇంటింటికి కార్యక్రమం సూపర్ సక్సెస్ చేయాలని చూస్తోంది అని అంటున్నారు.

Tags:    
  • VijayaYatra2025 
  • TDPForGoodGovernance 
  • ChandrababuNaidu 
  • SupaRipaalana 
  • TDPCampaign 
  • APGovernment 
  • PeopleFirstTDP 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS