చరిత్రలో తొలిసారి మదుపరులు సొమ్ము@రూ.400 లక్షల కోట్లు

అవును.. చరిత్రలో తొలిసారి భారత స్టాక్ ఎక్సైంజ్లో అపూర్వమైన రోజుగా ఏప్రిల్ 8ను పేర్కొనాలి

Update: 2024-04-09 06:05 GMT

అవును.. చరిత్రలో తొలిసారి భారత స్టాక్ ఎక్సైంజ్ లో అపూర్వమైన రోజుగా ఏప్రిల్ 8ను పేర్కొనాలి. ఎందుకంటే.. సోమవారం చరిత్రలోనే తొలిసారి బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.400లక్షల కోట్ల మార్కును దాటేయటమే దీనికి కారణం. సోమవారం ఇంట్రాడేలో రూ.401.16 లక్షలకోట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు రూ.4 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ మాంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు.. విదేశీ మదుపర్ల కొనుగోళ్ల అండతో స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది. సోమవారం సెన్సెక్స్.. నిఫ్టీలు తాజా తమ జీవనకాల గరిష్ఠాలకు చేరుకుంది. దీనికి తోడు రిలయన్స్ షేరుకు గిరాకీ లభించటం కూడా కలిసి వచ్చింది. భారత్ సెన్సెక్స్ తో పాటు ఆసియా మార్కెట్లలో సియోల్.. టోక్యో.. హాంకాంగ్ లు కూడా లాభపడ్డాయి. యూరోప్ సుచీలు సైతం మెరుగ్గా ట్రేడ్ కావటం గమనార్హం.

సెన్సెక్స్ సోమవారం ఉదయం 74,555 పాయింట్ల వద్ద దూకుడుగా ఆరంభమ.. రోజంతా అదే దూకుడును ప్రదర్శించింది. ఇంట్రాడేలో 74,869 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 494.28 పాయింట్ల లాభాన్ని నమోదు చేసి 74,742.5 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 150.60పాయింట్లను నమోదు చేసి 22,666.3 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 22,697.3 పాయింట్ల వద్ద కొత్త గరిష్ఠాన్ని నమోదు చేయటం గమనార్హం.

ఆసక్తికరమైన అంశం ఏమంటే 2007లో రూ.50 లక్షల కోట్లకు చేరిన బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 2014 మార్చిలో తొలిసారి రూ.వంద కోట్ల మార్కుకు చేరితే.. ఆ తర్వాత ఏడేళ్లకు మరో రూ.100 లక్షల కోట్లకు చేరింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే మొదటి ఏడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు చేరుకుంటే.. తర్వాత ఏడేళ్లకు ఏకంగా మరో రూ.వంద లక్షల కోట్లకు పెరిగింది. దీంతో 2021 ఫిబ్రవరిలో రూ.200 లక్షల కోట్ల మార్క్ ను దాటింది.

Read more!

ఆ తర్వాత కేవలం రెండున్నరేళ్ల కాలంలో అంటే 30 నెలల్లో రూ.200 లక్షల కోట్ల నుంచి రూ.300 లక్షల కోట్లకు చేరుకుంది. తాజాగా ఇది రూ.400 లక్షల కోట్లకు చేరుకొని సరికొత్త గరిష్ఠాల్ని నమోదు చేసింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ను తొలిసారి రలక్షల కోట్ల డాలర్ల మైలురాయిని తొలిసారి 2023 నవంబరు 29న చేరుకుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే రూ.300 లక్షల కోట్ల మార్కు నుంచి రూ.400 లక్షల కోట్ల మార్కుకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పట్టింది. దీంతో అమెరికా.. చైనా.. జపాన్.. హాంకాంగ్ తర్వాత ఈ స్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. మార్కెట్ పరంగా భారత్ ఈ మధ్యనే హాంకాంగ్ ను పక్కకు నెట్టి నాలుగో అతి పెద్ద దేశంగా అవతరించటం గమనార్హం.

Tags:    

Similar News