ఒక్కో బిడ్డపై రూ.75 లక్షలు !

ఎడ్‌-ఫిన్‌టెక్‌ కంపెనీ ‘ఎడ్యూ ఫండ్‌’ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

Update: 2024-05-23 07:30 GMT

పాపనో, బాబో ఒక బిడ్డ పుట్టడం, తర్వాత వారి పెంపకం, ఆ తర్వాత స్కూలు, కాలేజీ, భోజనం, వారి అహ్లాదం కోసం విహార యాత్రలు, ఆ తర్వాత అతను ఉద్యోగం చేసే వరకు సగటు భారతీయ కుటుంబం వెచ్చిస్తున్న మొత్తం ఖర్చు ఎంతో తెలుసా ? అక్షరాలా రూ.75 లక్షల రూపాయలు. ఎడ్‌-ఫిన్‌టెక్‌ కంపెనీ ‘ఎడ్యూ ఫండ్‌’ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

సాధారణ చదువులు కాకుండా మెడిసిన్ చదివితే రూ.95 లక్షలు, అదే విదేశాలలో విద్య అయితే ఈ ఖర్చు రూ.1.5 కోట్ల పై మాటేనని చెబుతుంది. ఆసుపత్రిలో సిజేరియన్ అయితే సగటున రూ.70 వేలు, 18 నెలల వరకు వ్యాక్సిన్లు. వైద్య ఖర్చులు రూ.50 వేలు, యూకేజీ వరకు రూ.4 లక్షలు, 18 ఏళ్ల వరకు భోజనం, చదువు, ఇతరత్రా ఖర్చులు రూ.30 లక్షలు అవుతుందని వెల్లడించింది.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా యువతలో సంతానోత్పత్తి సామర్ద్యం తగ్గుతుందని, కొత్తగా పెళ్లయిన జంటలు మునుపటి మాదిరిగా సంతానం మీద ఆసక్తి చూపడం లేదని, దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చుల భారమేనని చెబుతున్నారు. పట్టణాలలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా మిగులుతున్న సంపాదన అంతంత మాత్రమేనని సర్వేలో వెల్లడయింది. దీంతో పిల్లలను కనడం వాయిదా వేయడం లేదా అసలు పిల్లలే వద్దనుకోవడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News