పాక్ కాళ్ల బేరం.. కారణం చెప్పిన మిలటరీ వ్యవహారాల నిపుణుడు!
ఆపరేషన్ సిందూర్ తో భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, శనివారం సీజ్ ఫైర్ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.;
ఆపరేషన్ సిందూర్ తో భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, శనివారం సీజ్ ఫైర్ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే... ఇంత సడన్ గా, ఇప్పుడు ఈ వైపు నుంచి అవసరం లేకపోయినా భారత్ అంత ఉన్నపలంగా ఎందుకు సీజ్ ఫైర్ కి అంగీకరించింది? అనేది ఇప్పుడు భారత్ లోని 140 కోట్ల ప్రజానికంలోని మెజారిటీ ప్రజల సందేహంగా ఉందని అంటున్నారు.
అయితే... ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని.. అలా కానిపక్షంలో మీతో వాణిజ్యం చేయనని.. సీజ్ ఫైర్ కి అంగీకరిస్తే ఇరు దేశాలతోనూ పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తానని చెప్పి ఒప్పించానని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. మరోవైపు సీజ్ ఫైర్ కోసం ముందుగా.. భారత్ నుంచే ప్రపోజల్ వచ్చిందని పాకిస్థాన్ చెప్పుకుంటుంది.
ఈ సందర్భంగా స్పందించిన భారత్ మాత్రం.. శనివారం మధ్యాహ్నం పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత్ కు కాల్ వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించిందని వెల్లడించింది. ఈ సమయంలో పాకిస్థాన్ సీజ్ ఫైర్ కోసం వెంపర్లాడిందని చెబుతూ ఓ విశ్లేషణ తెరపైకి వచ్చింది. అందుకు గల కారణం ఆసక్తిగా ఉంది!
అవును... పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తామన్న పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అంటూ భారత్ కు ఫోన్ చేసి కాళ్లబేరానికి రావడం వెనుక... ఈ విషయంలో ముందుగా సీజ్ ఫైర్ కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగడం వెనుక అసలు కారణం ఒకటుందని తెలుస్తోంది. అదే... పాక్ అణ్వాయుధ కర్మాగారం సమీపంలో భారత్ బాంబు దాడి!
భారత్ ఇటీవల పాకిస్థాన్ పై పలు ప్రాంతాల్లో దాడి చేయగా.. అందులో ఒకటి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో... పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకుపుట్టి అమెరికాను ఆశ్రయించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ కారణం వల్లే సీజ్ ఫైర్ విషయంలో అమెరికా అంత యాక్టివ్ అయ్యిందని అంటారు.
ఈ సందర్భంగా స్పందించిన రాండ్ కార్పొరేషన్ కు చెందిన డెరక్ జే గ్రోస్మన్ అనే మిలటరీ వ్యవహారాల నిపుణుడు... అణ్వాయుధాలను నియంత్రించడంలోనూ, నిల్వచేయడంలోనూ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ పాత్ర అత్యంత కీలకం అని.. అలాంటి కంట్రోల్ సెంటర్ కు సమీపంలోనే ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్ చేసింది అని తెలిపారు.
ఇప్పటికే అన్ని లక్ష్యాలపైనా కచ్చితమైన దాడులు నిర్వహించే సత్తా భారత్ కు ఉందని చెప్పడమే దీని ఉద్దేశ్యం అని అంటూన్నారు. ఈ నేపథ్యంలోనే.. భారత్ – పాక్ ఘర్షణ అతిప్రమాదకరంగా ఉందని గ్రహించిన అమెరికా.. పాక్ రిక్వస్ట్ తో పాటు ప్రమాదాన్ని అంచనా వేసి రంగంలోకి దిగి, సీజ్ ఫైర్ గురించి సర్ధిచెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇదే అసలు విషయం అని అంటున్నారు!!