పీఓకే కోసం పాక్ భారత్ మధ్య మరో యుద్ధం. ?

భారత్ పాక్ కి మధ్య ఉన్న అతి పెద్ద గొడవ అంతా కాశ్మీర్ కోసమే. కాశ్మీర్ ని 1947లోనే టోటల్ గా ఆక్రమించాలని పాక్ పన్నిన పన్నాగం విఫలం అయింది.;

Update: 2025-05-13 03:58 GMT

భారత్ పాక్ కి మధ్య ఉన్న అతి పెద్ద గొడవ అంతా కాశ్మీర్ కోసమే. కాశ్మీర్ ని 1947లోనే టోటల్ గా ఆక్రమించాలని పాక్ పన్నిన పన్నాగం విఫలం అయింది. అందుకే మూడవ వంతు మాత్రమే ఆ దేశం చేతిలోకి వెళ్ళింది. పాక్ అక్రమిత కాశ్మీర్ లో కొండలు ఉన్నాయి. అదే సమయంలో ఖనిజాలు ఉన్నాయి. పాక్ అయితే పీవోకే తీసుకుంది కానీ ఏమీ అక్కడ చేయలేకపోయింది. ఉగ్రమూకలను అక్కడ ఉంచి పెంచి పోషించడం ద్వారా భారత్ ని దెబ్బ తీసే పనికే దానిని వాడుకుంటోంది.

ఇంతకీ పీఓకే అంటే ఏమిటి దాని కధా కమామీషూ ఏమిటి అన్నది కనుక చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని, ఈ ప్రాంతాన్ని పిలుస్తారు, ఇది కాశ్మీర్ ప్రాంతంలోని ఒక ముక్క. భారతదేశం పాకిస్తాన్ వివాదంలో కీలకమైన భాగం. ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. దాని మరో మాటగా చెప్పుకుంటే పాకిస్థాన్ దానిని ఆక్రమించింది అని కూడా చెప్పాలి.

ఇక గత కొన్ని దశాబ్దాల కాలంగా భారతదేశం పాక్ అక్రమిత కాశ్మీర్ ని క్లెయిమ్ చేస్తూ వస్తోంది. అయితే పీఓకే అన్నది దక్షిణాసియాలో అత్యంత వివాదాస్పద ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ఇక ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరగడంతో పాటు గత కొన్ని రోజులుగా భారత్ పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు అధికం కావడంతో ఉగ్రవాదానికి కేంద్రంగా పీఓకే ఉంది అన్నది మరోసారి భారత్ గుర్తు చేసుకుంటోంది. అందుకే దాని వ్యూహాత్మక స్థానం చూసి మరీ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం పై భారతదేశం పూర్తిగా ఫోకస్ పెట్టింది.

ఇక ఇంతలా పీఓకే ఇపుడు నలుగుతోంది కదా ఈ తరానికి దీని గురించి తెలియాల్సింది చాలానే ఉంది అని అంటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు కోసం చరిత్ర పుటలలోకి వెళ్ళాలి. 1947లో జరిగిన మొదటి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం నుండి పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న పూర్వపు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని పీఓకేలో పేర్కొంటూ వస్తున్నారు.

ఇక పీఓకేకు దక్షిణ భాగంలో ముజఫరాబాద్ గిల్గిట్-బాల్టిస్తాన్ ఉన్నాయి. ఉత్తర భాగంలో వ్యూహాత్మకంగా చైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి అలా ఈ ప్రాంతం రెండు భాగాలుగా రూపొందించబడింది: ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అన్నది భారత్ లో ఉంది. ఇందులో కాశ్మీర్ జమ్మూలోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ ఇది మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంటుంది. 1947 జమ్మూ కాశ్మీర్ హిందూ రాజు ఏలుబడిలో ఉన్నపుడు ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయింది.

అది గిట్టని పాకిస్తాన్ 1947 అక్టోబర్ లో కాశ్మీర్‌ కోసం భారత్ మీదకు మొదటిసారి యుద్ధం చేసింది. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ చేయించింది. అలా పీఓకే అన్నది నియంత్రణ రేఖగా మారిపోయింది. ఆ తరువాత 1949లో భారతదేశం పాకిస్తాన్ మధ్య కరాచీ ఒప్పందం కుదిరింది.

ఇక 1965 రెండోసారి పాక్ ఇండియా మధ్య యుద్ధం జరిగినా పీఓకే అన్న ఊసు లేకుండానే ముగిసింది. 1971 మూడవసారి జరిగిన భారత్ పాక్ యుద్ధం పర్యవసానంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారి స్వాతంత్ర్యం పొందింది. ఆనాడూ పీఓకే ప్రస్తావన లేదు.

ఇక 1989 భారత పరిపాలనలో ఉన్న కాశ్మీర్‌లో తిరుగుబాటు చెలరేగింది. అది కాస్తా 1999లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంగా మారింది. కాశ్మీర్ లో ఉగ్రవాదులను పంపించి ప్రచ్ఛన్న యుద్ధానికి పాక్ తెర తీయడం వల్లనే ఇదంతా జరిగింది.

ఇలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గడచిన పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ఉగ్రవాదులకు అడ్డాగా మార్చి భారత్ మీదకు ఉసిగొల్పి నరకం చూపిస్తోంది. అందుకే భారత్ పీఓకే కావాలని అంటోంది. ప్రధాని తాజాగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా పీఓకే గురించి గట్టిగా చెప్పారు.

దాంతో ఇక మీదట పాక్ చర్చలలో ఇదే అంశం ప్రధానంగా ఉంటుంది పీఓకే తోనే భారత్ లో ఉగ్ర మూకలను పంపుతున్న పాక్ దాని కోసమే యుద్ధాలు చేస్తూ వస్తున్న పాక్ భారత్ కి దానిని వదులుకుంటుందా అన్నదే ప్రశ్న. వదులుకోకపోతే మాత్రం ఈసారి జరిగే పాక్ భారత్ యుద్ధం కేవలం పీఓకే గురించే జరుగుతుంది అన్నది వాస్తవం.

Tags:    

Similar News