• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మే 9-10 న పాక్ కు భారత్...

మే 9-10 న పాక్ కు భారత్ ఎలా ఎర వేసి, కొట్టిందో తెలుసా?

| ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ మే 6-7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్దీ తుర్కియే డ్రోన్లను పాకిస్థాన్ పంపించిన సంగతి తెలిసిందే!

By - Tupaki Desk
Update: 2025-05-16 07:15 GMT

ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ మే 6-7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్దీ తుర్కియే డ్రోన్లను పాకిస్థాన్ పంపించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... భారత్ గగనతల రక్షణ వ్యవస్థలను గుర్తించి వాటిని ధ్వంసం చేయాలని భావించింది. అయితే... భారతదేశ బలమైన ఎయిర్ డిఫెన్స్ పాక్ వ్యూహాన్ని చిత్తు చేసింది. ఈ సమయంలో మే 10న భారత్ వ్యూహాత్మకంగా ముందుకు కదిలింది.. పాక్ ను వణికించేసింది.

అవును... మే 9-10 తేదీ రాత్రి వేళల్లో భారత్ లోని పౌర నివాసాలు, స్కూళ్లు, హాస్పటల్స్, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొన్న పాక్.. డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసింది. దీంతో... పాకిస్థాన్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. ఈ సమయంలో పాక్ వద్ద ఉన్న హెచ్.క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థ అడ్డంకిగా మారిందని గుర్తించింది.. వెంటనే తన డికాయ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.

ఇందులో భాగంగా... వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్ లను గాల్లోకి వదిలింది భారత్. దీంతో... భారత్ ఫైటర్ జెట్లు దొరికేశాయంటూ పాకిస్థాన్ హెచ్.క్యు-9, సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీంతో.. వీటిని మొహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్.. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది.. పాక్ రాడార్ వ్యవస్థను దెబ్బతీసింది.

ఈ సమయంలో భారత్ పశ్చిమ కమాండ్ల నుంచి బ్రహ్మోస్ సహా స్కాల్ఫ్, ర్యాపేజ్, క్రిస్టల్ మేజ్ వంటి ఆయుధాలు ప్రయోగించి.. నిరాటంకంగా పాక్ ఎయిర్ బేస్ లపైకి దూసుకెళ్లాయి. ఈ సమయంలో... బలమైన షెల్టర్లు, కమాండ్ సెంటర్లు, రన్ వే లను దెబ్బతీసేపనిని బ్రహ్మోస్ చూసుకొందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో.. పాక్ లోని 12 కీలక ఎయిర్ బేసుల్లో 11ను భారత్ దెబ్బతీసిందని పేర్కొంది!

కాగా... క్రిస్టల్ మేజ్ అనేవి ఇజ్రాయెల్ కు చెందిన గగనతలం నుంచి ఉపరితలపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణి! వీటిలో క్రిస్టల్ మేజ్-1 (రాప్టర్), క్రిస్టల్ మేజ్-2(రాక్స్) రకాలను భారత్ వాడుతోంది. వీటి బరువు 1,000 కేజీలు ఉండటంతో పాటు 80 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు. సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు వీటిని ప్రయోగించగలవు. ప్రధానంగా కదిలే లక్ష్యాలను టార్గెట్ చేయడంలో ఇవి దిట్టని చెబుతారు!

ఇక ర్యాపేజ్ కూడా ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ తయారుచేసింది. ఇది సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ గ్రౌండ్ మిసైల్. ఇవి స్పైస్ 2000 బంబుల కంటే ఎక్కువ రేంజ్ ను ఇవ్వగలవు. సుఖోయ్-30, మిగ్-29లు వీటిని ప్రయోగించగలవు!

Tags:    
  • IndiaStrikesBack 
  • BrahMos 
  • CrystalMaze 
  • DecoyStrategy 
  • AirDefenseWar 
  • PakistanHQ9 
  • May10Retaliation 
  • PakAirbases 
  • IndianAirForce 

Similar News

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

Copyright @2026

Powered by Blink CMS