ఐఐటీ చదివినా నిరుద్యోగం తప్పలేదు !

చదువు విజ్ఞానం కోసమే .. ఉద్యోగం కోసం కాదు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు

Update: 2024-05-23 16:30 GMT

చదువు విజ్ఞానం కోసమే .. ఉద్యోగం కోసం కాదు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఐటీ జాబ్, ఐదంకెల జీతం అని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సవుతున్నారు. అందుకే మిగతా రంగాలలో సరైన నిపుణులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విదేశాలలో ఎలాంటి పని అయినా చేయడానికి సిద్దపడే మన వాళ్లు ఇక్కడ మాత్రం తాము అనుకున్న పనిమాత్రమే చేస్తామని చెబుతున్నారు.

అయితే దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలు ఐఐటీలలో చదివినా ఉద్యోగాలు రావడం లేదని వెల్లడయింది. ఐఐటీలో సీటు రావడాన్నే ఉద్యోగం వచ్చినట్లుగా భావిస్తారు. ఏటా 3.50 లక్షల మంది విద్యార్థులు ఇందులో సీటు కోసం పోటీ పడుతున్నారు. మొదట ఖరగ్ పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ ఐఐటీలు వరసగా ఏర్పాటు చేశారు. 2008లో హైదరాబాద్, రాజస్తాన్, భువనేశ్వర్, పాట్నా, గాంధీనగర్, పంజాబ్ లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండిలో, ఇండోర్ లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించారు. 2012 లో వారాణసి లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించారు.

ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదివిన వారికి ప్రస్తుతం ప్లేస్ మెంట్స్ లభించడం లేదు. ధీరజ్ సింగ్ అనే ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించాడు.

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు ప్లేస్ మెంట్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీలలో కలిపి 8,100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు. 2024లో ప్లేస్ మెంట్ల కోసం 21,500 మంది ఐఐటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 13,410 మందికి ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 38 శాతం మందికి ఎలాంటి ప్లేస్ మెంట్స్ లభించలేదు.

Read more!

2022లో 3,400 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించలేదు. పాత 9 ఐఐటీలతో కలిపి 16,400 మంది ప్లేస్ మెంట్ల కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంకా 6,050 మంది అంటే 37 శాతం మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీలలో ఉద్యోగాల కోసం 5100 మంది ధరఖాస్తు చేసుకోగా 2040 మందిని ఏ కంపెనీ తీసుకోలేదు. ఇంత మంచి సంస్థలలో చదివినా విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవడం దేశంలో నెలకొన్న నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం అని ధీరజ్ సింగ్ వెల్లడించాడు.

Tags:    

Similar News