ఉద్యోగాలపై ఎలాన్ మస్క్ నుంచి సంచలన విషయం!

ప్రపంచ కుబేరుడు, టెస్కా సీఈఓ ఎలాన్ మస్క్ నుంచి ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.;

Update: 2025-11-23 10:13 GMT

ప్రపంచ కుబేరుడు, టెస్కా సీఈఓ ఎలాన్ మస్క్ నుంచి ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. వాస్తవానికి గత కొంతకాలంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కొందరంటే.. ఏఐ వల్ల అలాంటి ప్రమాదం ఏమీ లేదనేది మరికొందరి వాదనగా వినిపిస్తోన్న వేళ.. అందుకు పూర్తి విభిన్నంగా అన్నట్లుగా ఎలాన్ మస్క్ నుంచి సంచలన స్టేట్ మెంట్ తెరపైకి వచ్చింది. అదే త్వరలో 'జాబ్ ఒక ఆప్షనల్' అని!

అవును... పని భవిష్యత్తు గురించి ఎలాన్ మస్క్ ఓ అద్భుతమైన అంచనా వేశారు. ఇందులో భాగంగా... రాబోయే దశాబ్ధాల్లో చాలా మందికి ఉద్యోగం ఒక ఆప్షన్ గా మారవచ్చని అన్నారు. యూఎస్-సౌదీ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ లో మాట్లాడిన ఆయన... ఏఐ, రోబోటిక్స్ లో పురోగతి సమాజాన్ని ఎలా పునర్నిర్మించగలదో, సాంప్రదాయ ఉద్యోగాల అవసరాన్ని ఎలా ప్రభావితం చేయగలదనే విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఎలాన్ మస్క్... దీర్ఘకాలికం అంటే నాకు కచ్చితంగా తెలియదు కానీ... బహుశా 10 నుంచి 20 సంవత్సరాలలో తన అంచనా ప్రకారం ఉద్యోగం లేదా పని అనేది ఐచ్ఛికం అని అన్నారు. భవిష్యత్తులో పనిని ఆటలు ఆడటం లేదా వీడియో గేమ్స్ ఆడటం, సంగీతం వినడం వంటి కార్యకలాపాలతో పోల్చారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎంపికలు ఉంటాయని తెలిపారు.

డబ్బు దాని ప్రాముఖ్యతను కోల్పోవచ్చు!:

ఈ మార్పూ కేవలం పనిలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని మస్క్ భావించారు. ఇందులో భాగంగా... భవిష్యత్తులో ఏఐ, రోబోటిక్స్ ఆధిపత్యం చెలాయించే కాలంలో డబ్బు దాని ప్రాముఖ్యతను కోల్పోవచ్చని మస్క్ అన్నారు. సాంప్రదాయ కరెన్సీని వాడుకలో లేనిదానిగా చేసే ఏఐ సమాజాన్ని ఆయన ప్రస్థావించారు.

ఈ నేపథ్యంలో మానవ జీవితంలో కరెన్సీకి నేడు ఉన్నంత విలువ ఉండకపోవచ్చని తెలిపారు. ఇదే సమయంలో... ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలిస్తాయని మస్క్ పేర్కొన్నారు. ప్రస్తుతం టెస్లా ఈ రంగానికి నాయకత్వం వహిస్తుండగా.. ఫ్యూచర్ లో అనేక కంపెనీలు ఈ హ్యూమనాయిడ్ రోబోల ఉత్పత్తి రంగంలోకి అడుగుపెడతాని తెలిపారు.

Tags:    

Similar News