• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇక్కడున్న బంగారాన్ని...

ఇక్కడున్న బంగారాన్ని పంచితే అందరూ బిలియనీర్లే!

| ఈ క్రమంలో తాజాగా బంగారంతో నిండిన ఒక గ్రహశకలాన్ని కనుగొంది. ఇప్పుడు ఆ గ్రహశకలాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది.

By - Tupaki Desk
Update: 2023-10-12 15:30 GMT

ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మహాద్భుతాలు, ఇంకెన్నో రహస్యాలు, ఎన్నెన్నో నిగూడ రహస్యాలు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని రహస్యాలపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిత్యం ఏదో ఒక రీసెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఈ సృష్టి ఆవిర్భావం, జీవం పుట్టుక, ఈ ప్రపంచం ఆవలి ప్రపంచం పై నిత్యం ఏదో ఒక పరిశోధన చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా బంగారంతో నిండిన ఒక గ్రహశకలాన్ని కనుగొంది. ఇప్పుడు ఆ గ్రహశకలాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది.

అవును... అంతర్జాతీయ అంతరిక్ష పరిశోదనా కేంద్రం(నాసా) తాజాగా అంగారక - బృహస్పతి గ్రహాల మధ్యనున్న "16 సైక్‌" అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా దీనికోసం ఉద్దేశించిన మిషన్‌ పై పని చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ లోహ గ్రహశకలంలో నిండా ఇనుము, నికెల్ తో పాటు భారీ ఎత్తున బంగారం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక అక్కడున ఆ ఖనిజాల విలువ లెక్కించడం సాధారణ కాలిక్యిలేటర్లకు ఆల్ మోస్ట్ అసాధ్యం. కారణం... ఆ గ్రహ శకలంపై ఉన్న ఖనిజాల విలువ 10,000 క్వాడ్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఒక్క ఒక క్వాడ్రిలియన్ అంటే... 1 తర్వాత 15 సున్నాలకు సమానమైన సంఖ్య (1,000,000,000,000,000)! దాన్ని బట్టి ఎవరి లెవెల్లో వారు అంచనా వేసుకోవచ్చన్నమాట!

సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు) వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం బంగాళాదుంప ఆకారంలో ఉంటుందని నాసా చెబుతుంది. భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు. అందుకే దీనికి 16 సైక్ అని నామకరణం చేశారు.

ఇక ఈ గ్రహశకలాన్ని ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న కనుగొన్నారు. దీంతో... ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది.. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది అని చెబుతుంటారు. ఈ గ్రహశకలంపై ఉన్న రెండు లోతైన ప్రాంతాల వల్ల... ఇది చేప ఆకారంలో కనిపిస్తుంటుంది!

ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. ఈ క్రమంలో... నాసా ఈ సైక్ స్పేస్‌ క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ గ్రహశకలంపై లభించే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చట!

Tags:    
  • Spacestation 
  • Internationalspaceresearchcenter(NASA) 
  • Mars 
  • Jupiter 
  • Earth 
  • Moon 
  • 16Psych 
  • Annibaledegasparis 
  • Romancupid 
  • Sun 

Similar News

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

Copyright @2026

Powered by Blink CMS