• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైడ్రా దూకుడు.. ఐదంస్తుల...

హైడ్రా దూకుడు.. ఐదంస్తుల అపార్ట్‌మెంట్ నేలమట్టం

| అలా.. 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-01-05 08:55 GMT

హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కాపాడడమే లక్ష్యంగా తీసుకొచ్చిన హైడ్రా.. మళ్లీ దూకుడు మొదలుపెట్టింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక వెంటనే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే హైడ్రా వందలాది కట్టడాలను నేలమట్టం చేసింది. అలా.. 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. తాజాగా.. తన పనిని మరోసారి ప్రారంభించింది.

ఇప్పటివరకు ఆక్రమణకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను హైడ్రా కాపాడింది. అలాగే.. ఆయా చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చింది. ఆ స్థలాలను విముక్తి కల్పించింది. అలాగే.. రాయదుర్గం పరిధిలని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన ఇళ్లను, దుకాణాలను సైతం తొలగించింది.

తాజాగా.. శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో 684 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్‌మెంటును నిర్మించారు. ప్రస్తుతం ఇంకా ఇది నిర్మాణ దశలోనే ఉంది. దాదాపు చివరి దశలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ అక్రమంగా నిర్మిస్తున్నారంటూ స్థానికుల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైకోర్టు, జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసినా అక్రమ నిర్మాణం కొనసాగుతున్నాయంటూ స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు అయ్యప్ప సొసైటీని సందర్శించారు. 100 ఫీట్ రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ నిర్మాణం అక్రమమని తేల్చారు. హైకోర్టు ఆదేశాలు, జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులను సైతం బిల్డర్ బేఖాతర్ చేశాడని తేలింది. సెల్లార్‌తోపాటు జీ ప్లస్ 5 అంతస్తులు కలిగిన ఈ భవనం అక్రమ నిర్మాణం అంటూ 2024 ఫిబ్రవరిలోనే నిర్ధారించారు. అయినా బిల్డర్ పట్టించుకోకుండా నిర్మిస్తూనే ఉన్నాడు. దానిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశించింది. జూన్‌లో జీహెచ్ఎంసీ మరోసారి నోటీసులు పంపింది. అయినా బిల్డర్ పట్టించుకోలేదు. దీంతో హైడ్రా రంగ ప్రవేశం చేసింది. స్వయంగా రంగనాథ్ వచ్చి చూశారు. అక్రమ నిర్మాణమే అని నిర్ధారించుకున్న తరువాత ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు.

Tags:    
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • Revanthreddy 
  • TelanganaCM 
  • Hydra 
  • HYDRA 
  • Hydraofficials 
  • Ranganath 
  • GHMCrules 
  • Highcourtorders 
  • Revenuueofficials 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS