• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్యకు మేసేజ్ లు పంపాడని...

భార్యకు మేసేజ్ లు పంపాడని కుడి చేతిని నరికేశారు

| ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది.

By - Tupaki Desk
Update: 2025-02-18 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. నిడమర్రు మండలం బావాయిపాలేనికి చెందిన 26 ఏళ్ల ఏసురాజు కనిపించకుండా పోయాడు. ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు అతడి కుడి చేతిని గుర్తించారు. కుడి చేయి లభించినా.. అతడి డెడ్ బాడీ మాత్రం దొరకలేదు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది.

ప్రియురాలి భర్త.. మామలే ఏసురాజును హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరికి మరో వ్యక్తి కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఏసురాజు కుడి చేతిని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో హత్యకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ సమాచారం బయటకు వెల్లడించనట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగానే ఈ అరెస్టును ఇంకా చూపించలేదని చెబుతున్నారు.

అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏసుబాబు ఒక వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని.. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు భర్త.. పలుమార్లు ఏసురాజును పద్దతి మార్చుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. దీంతో భరించలేని ఆవేశానికి గురైన భర్త.. మామతో కలిసి అతడ్ని హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల (శనివారం) అత్తింట్లో తన భార్యతో ఏసు రాజు ఉన్న విషయాన్ని తెలుసుకున్న భర్త భరించలేకపోయాడు.

ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు. వీరిద్దరు కలిసి మరొకరి సాయాన్ని తీసుకొని.. ఏసురాజును బావాయిపాలెనికి తీసుకొచ్చారు. ఆమెకు తరచూ మెసేజ్ పంపే కుడి చేతిని పదునైన కత్తితో సగానికి నరికేసి.. పంట కాలువలో అతడ్ని పడేసి ముగ్గురు పరారయ్యారు. తీవ్రమైన రక్తస్రావంతో ఏసురాజు చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    
  • Youngboy 
  • Husband 
  • Wife 
  • Affair 
  • Woman 
  • Eluru 
  • Police 
  • Mu*rder 
  • Interrogation 
  • Extramaritalaffair 
  • Arrest 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS