"ఐ లవ్ యూ"కి బదులుగా పాకిస్తానీలు ఏమంటారు?
సాధారణంగా సింధీ భాషలో "మా తోఖే పసంద్ కారయా" అని ఒకరికొకరు తమ ఇష్టాన్ని తెలుపుకుంటారు. ఇది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తుంది.;
పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్కరికీ పాకిస్తాన్ మీద పీకల మీద దాక కోపం ఉంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆచారాలు, కథలు, సాధారణ విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. ప్రేమను గౌరవించే వ్యక్తులు అక్కడ కూడా ఉన్నారు. భారతదేశంలో ప్రేమను వ్యక్తం చేయడానికి "ఐ లవ్ యూ" అని చెబితే, పాకిస్తాన్‌లోని ప్రజలు తమ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. వారు చెప్పే విధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రేమ విషయానికి వస్తే పాకిస్తాన్‌లోని ప్రజలు కూడా ఏమీ తక్కువ రొమాంటిక్ కాదు. అక్కడ కూడా జంటలు తమ ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేసుకుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వారి ప్రేమ చెప్పే విధానం వారి ప్రాంతీయ భాషలు, సంస్కృతితో ముడిపడి ఉంటాయి.
సాధారణంగా పాకిస్తాన్‌లోని ప్రజలు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఉర్దూ భాషను ఉపయోగిస్తారు. ఒక పురుషుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ "మైన్ తుమ్సే ప్యార్ కర్తా హూఁ" అని అంటాడు. అదేవిధంగా, ఒక స్త్రీ తన ప్రేమను "మైన్ తుమ్సే ప్యార్ కర్తీ హూఁ" అని చెబుతుంది. ఉర్దూలో ప్రేమను వ్యక్తం చేసే ఈ విధానం చాలా కామనో్.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి వస్తే.. ఇక్కడ జంటలు పంజాబీ భాషలో తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. ఒక భాగస్వామి మరొకరితో "మైన్ తెన్నూ ప్యార్ కర్దా" లేదా స్త్రీ అయితే "మైన్ తెన్నూ ప్యార్ కర్దీ" అని అంటారు. చెప్పే విధానం వారి ప్రేమ తీవ్రతను, నిజాయితీని ప్రతిబింబిస్తాయి.
సింధ్ ప్రాంతంలో జంటలు సింధీ భాషలో తమ హృదయ భావాలను తెలియజేస్తారు. సాధారణంగా సింధీ భాషలో "మా తోఖే పసంద్ కారయా" అని ఒకరికొకరు తమ ఇష్టాన్ని తెలుపుకుంటారు. ఇది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తుంది.
పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా ప్రేమను వ్యక్తం చేసేవారు తక్కువేమీ కాదు. ఇక్కడ జంటలు పష్తో భాషలో తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. ఒకరికొకరు "జా సాటా సారా మీనా కవూమ్" అని తమ ప్రేమను తెలియజేస్తారు. వారు చెప్పే విధానం వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
పాకిస్తాన్‌లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే జంటలు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆంగ్ల భాషను కూడా ఉపయోగిస్తారు. వారు "ఐ లవ్ యూ" (I Love You) అని చెప్పడం రొమాంటిక్‌గా ఉండటమే కాకుండా ఆధునిక విధానంగా భావిస్తారు.