జగన్ క్యాబినెట్ లో తొలి మంత్రి ఆయనేనా...!?

వై నాట్ డబుల్ సెంచరీ అంటూ మేమంతా సిద్ధం సభలలో జగన్ రీ సౌండ్ చేస్తున్నారు.

Update: 2024-04-04 15:30 GMT

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి వార్ పోటాపోటీగా సాగుతోంది. ఎవరు గెలుస్తారు అంటే సర్వేశ్వరులు కూడా కరెక్ట్ గా చెప్పడంలేదు. టైట్ ఫైట్ నడుస్తోంది అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆయన వై నాట్ 175 సీట్లు అంటున్నారు. పాతిక ఎంపీ సీట్లు కూడా మావే అంటున్నారు. వై నాట్ డబుల్ సెంచరీ అంటూ మేమంతా సిద్ధం సభలలో జగన్ రీ సౌండ్ చేస్తున్నారు.

గతంలో జరిగిన సభలలో జగన్ రెండవసారి నేనే సీఎం. విశాఖ వేదికగా ప్రమాణం చేస్తాను అని డేట్ టైం ప్లేస్ ఫిక్స్ చేశారు. అప్పటికి ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు. ఇదేమిటి ఇలా అని అంతా అనుకున్నారు. ఇక ఇటీవల చిత్తూరు జిల్లా సభలలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని నేను. 151 సీట్లు గతంలో వచ్చాయి. 175 సీట్లు ఈసారి ఎందుకు రావు అని ప్రశ్నించారు.

ఇక ఆయన పూతలపట్టు సభలో మరో అడుగు ముందుకేసి కుప్పంలో ఈసారి చంద్రబాబుని ప్రజలు ఓడించారని కోరారు. బాబు మీద వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమెల్సీ భరత్ ని గెలిపించాలని కోరారు. భరత్ ని గెలిపిస్తే తన మంత్రివర్గంలో తీసుకునే మొదటి మంత్రి ఆయనే అవుతారు అని సంచలన ప్రకటన చేశారు.

అంటే జగన్ అపుడే మంత్రి వర్గం దాకా వెళ్ళిపోయారని అంటున్నారు. ఏపీలో ఎన్ని సీట్లు తమకు వస్తాయో చెబుతున్నారు. సీఎం గా ప్రమాణం ఎక్కడ నుంచి చేస్తామో చెబుతున్నారు. ఇపుడు మంత్రుల లిస్ట్ కూడా చదువుతున్నారు. దాంతో జగన్ ఎక్కడికో వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఆయనది ఓవర్ కాన్ఫిడెన్స్ లేక నిజంగా ధీమాతో ఈ మాటలు అంటున్నారా అన్న చర్చ సాగుతోంది.

Read more!

ఇంకో వైపు చూస్తే విపక్ష టీడీపీ మాత్రం ఇదంతా జగన్ మైండ్ గేమ్ అని అంటోంది. చంద్రబాబు అయితే ఎక్కడ వైసీపీ ఆ పార్టీ ఖేల్ ఖతం అయిపోయింది అని చెప్పేస్తున్నారు. ఆరు నూరు అయినా మేమే వస్తున్నామని బాబు అంటున్నారు. ఓడిపోతున్న వేళ జగన్ జనాలను మభ్యపెడుతున్నారని నిందిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ తొలి మంత్రి ఎవరో చెప్పేశారు. వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే ఆ తరువాత మంత్రుల జాబితా కూడా మిగిలిన సభలలో ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతోంది. చిత్తూరు జిల్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. ఆయనను కాదని వేరే వారికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా ఒక్క మాట చెప్పుకోవాలంటే కుప్పం ప్రజలు లక్కీ అంటున్నారు. చంద్రబాబు సీఎం క్యాండిడేట్. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్ధి భరత్ మినిస్టర్ క్యాండిడేట్. సో ఎవరిని జనాలు గెలిపిస్తారో చూడాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News