• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గుంటూరు పశ్చిమలో వార్ వన్...

గుంటూరు పశ్చిమలో వార్ వన్ సైడ్ అంటుంది ఇందుకేనా?

| ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాబోతుంది

By - Tupaki Desk
Update: 2024-05-11 05:00 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో.. గుంటూరు పశ్చిమలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! ఇందులో భాగంగా... ఒక్కసారిగా వార్ వన్ సైడ్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. దీంతో... ఇంత సీరియస్ ఎలక్షన్స్ లో ఇలా ఎలా వదిలేశారనే చర్చ తెరపైకి వచ్చింది.. అందుకు గల పలు కారణాలపైనా చర్చ జరుగుతుంది!

అవును... ఈ ఎన్నికలు అటు వైసీపీ, ఇటు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవనేది తెలిసిన విషయమే. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో అనూహ్యమార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఈ సమయంలో గుంటూరు వెస్ట్ లో వైసీపీ అభ్యర్థి మంత్రి విడదల రజనీ పూర్తి ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది! జగనన్న సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ఆమె అంటున్నారు. గుంటూరు ఆడపడచుగా భావించి గెలిపించమని కోరుతున్నారు.

వాస్తవానికి... ఆరు నెలల క్రితమే చిలకలూరిపేట నుంచి గుంటూరుకు మకాం మార్చారు విడదల రజనీ. ఈ నేపథ్యంలోనే స్థానికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రత్యర్థి మూకలు ఆ కార్యాలయంపై రాళ్లు విసరడం.. అది కాస్తా పెద్ద రచ్చ అవ్వడం.. అది కూడా విడదల రజనీకి ప్లస్ అవ్వడం తెలిసిందే. ధైర్యంగా పోటీ చేసి గెలవలేక రాళ్లు విసురుతారా? అని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రచారంలో కూడా విడదల రజనీ తనదైన దూకుడు కొనసాగిస్తున్నారని అంటున్నారు. చేసింది చెబుతూ.. చేయగలిగేవి మాత్రమే హామీ ఇస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపించకుండా.. సీఎం జగన్ మార్గంలోనే ప్రజలకు చెబుతున్నారని అంటున్నారు. నిజాయితీగా.. పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రజాసేవ చేస్తామని అంటున్నారు.

ఆమె సంగతి అలా ఉంటే... తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గళ్లా మాధవి అభ్యర్థిత్వాన్ని సరిగ్గా 60 రోజుల ముందు ప్రకటించారు చంద్రబాబు. దీంతో ఆ నిర్ణయం ఆమెకు పెద్ద మైనస్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తోడు మండుతున్న ఎండల కారణంగానో ఏమో కానీ.. కేవలం సాయంత్రం సమయంలోనే ప్రచారానికి వెళ్లడంతో ఇప్పటికీ పలు ప్రాంతాలు కవరవ్వలేదని చెబుతున్నారు!

దీనికి తోడు కూటమి నేతలు అవుట్ ఫోకస్ లోకి వెళ్లారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ముఖ్యంగా గుంటూరు పశ్చిమ సీటు ఆశించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ సైలంట్ అయిపోయారని.. ప్రస్తుతం ఆయన బయటకు రావడం లేదని.. జనసేన కార్యకర్తలను ఒకచోటుకి పిలవడం, వారితో మీటింగులు పెట్టడం వంటి కార్యక్రమాలేమీ చేసినట్లు లేరని చెప్పుకుంటున్నారు.

మరోవైపు బీజేపీ నేత, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న వల్లూరి జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి! ఆయనకి జాతీయ స్థాయి నాయకులు జేపీ నడ్డాలాంటి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో... ఆయన అక్కడే ప్రధనంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇలాంటి పలు కారణాలతో గుంటూరు పశ్చిమలో వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు!!

Tags:    
  • Gunturwest 
  • Apelections 
  • Appolitics 
  • YSRCP 
  • Jaganmohanreddy 
  • Rajinividadala 
  • Chandrababu 
  • TDP 
  • Gallamadhavi 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS