• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విచక్షణరహితంగా విద్యార్థి...

విచక్షణరహితంగా విద్యార్థి కాల్పులు.. 11 మంది మృతి

| ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో ఓ విద్యార్థి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

By - Tupaki Desk
Update: 2025-06-10 11:27 GMT

ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో ఓ విద్యార్థి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాలశాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

అధికారుల వివరాల ప్రకారం, గ్రాజ్ నగరంలోని ఒక హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థి ఆయుధంతో స్కూల్‌లోకి చొరబడి, రెండు తరగతుల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 30 మంది వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళా ఉపాధ్యాయురాలిపై దుండగుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కాల్పుల అనంతరం దుండగుడు స్కూల్‌లోని బాత్రూంలోకి వెళ్లి తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు అక్కడే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో స్కూల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా దళాలను మోహరించారు.

గతంలోనూ 2015 జూన్‌లో గ్రాజ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం జరిగిన ఈ దాడికి ఆ ఘటనే ప్రేరణ కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన ఆస్ట్రియా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    
  • GrazShooting 
  • AustriaTragedy 
  • SchoolViolence 
  • PrayForGraz 
  • GunControlNow 
  • Gunshooting 
  • AustriaSchool 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS