సిగరేట్ తాగే పురుషుల సంఖ్య పెరుగుతుందా..? తాజా సర్వేలో సంచలన విషయాలు..
‘సరదా సరదా సిగిరెట్టు.. ఇది దొరల్ తాగుమరి సిగరేట్టు’ ఎప్పుడో 80లో రేలంగి పాట పాడి మరీ చెప్పారు. ఇప్పటి జనరేషన్ కు ఇది పెద్దగా తెలిసి ఉండదు;
‘సరదా సరదా సిగిరెట్టు.. ఇది దొరల్ తాగుమరి సిగరేట్టు’ ఎప్పుడో 80లో రేలంగి పాట పాడి మరీ చెప్పారు. ఇప్పటి జనరేషన్ కు ఇది పెద్దగా తెలిసి ఉండదు. కానీ 80 నుంచి ఇప్పటి వరకు ఉన్న వారికి తెలిసే ఉంటుంది. సిగరేట్టపై ఏ పాటైనా పాడాలంటే ఆ జాబితాలో ఈ పాట మస్ట్ గా ఉండాల్సిందే. ఆ కాలంలోనే ఈ సాంగ్ అంత పాపులర్. ఒక జనరేషన్ లో సిగరేట్ కు చాలా మంది బానిసలుగా మారారు. కానీ రాను రాను వ్యాధులు, వాతావరణం పెరుగుతుండడంతో కాస్త తగ్గించారు. ప్రపంచంలో సిగరేట్టు తాగే వారిపై ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలు సంచలన విషయాలను వెల్లడిస్తున్నాయి.
కలవరం తెప్పిస్తున్న పురుషుల సంఖ్య..
సిగరేట్లు కేవలం మగవారే కాదు.. ఆడవారు సైతం తాగుతున్నారు. గతంలో ప్రాశ్చాత్య దేశాల మహిళలు సిగరేట్టు తాగేవారు కానీ ఆ కల్చర్ నేడు భారత్ కు కూడా వ్యాపించింది. నేడు ఇక్కడ సిగరేట్ తాగే వారి సంఖ్య పెరుగుతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మహిళలు పొగతాడం పక్కన పెడితే పురుషులు తాగడంపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఏ దేశంలో ఎంత మంది పురుషులు సిగరేట్ తాగుతున్నారని శాతంగా లెక్కించారు.
అత్యంత ఎక్కువ ఇండోనేషియాలోనే..
పురుషులు సిగరేట్టు తాగే వారి సంఖ్యను పరిశీలిస్తే ఇండోనేషియాలో అత్యంత ఎక్కువ శాతంగా ఉన్నారు. ఆ దేశంలో 70.5 శాతం పురుషులు సిగరేట్ తాగుతారని తేలింది. ఇక అత్యంత తక్కువ 6 శాతం స్వీడన్ పురుషులు స్మోక్ చేస్తారట. ఇక భరత్ విషయానికస్తే ఈ సంఖ్య 42 శాతంగా ఉందట. భారత్ లో బహిరంగ స్మోకింగ్ నిషేధం కాబట్టి కొంత మేరకు తగ్గిందని చెప్పవచ్చు. కానీ ఇది పటిష్టంగా అమలుకావడం లేదు. ఇక వరుసగా దేశాల పరంగా చూసుకుంటే..
ఏ దేశంలో ఎంత శాతం అంటే..
మయన్మార్-70.2%, బంగ్లాదేశ్-60.6%, చీలి-49.2%, చైనా-47.7%,
సౌతాఫ్రికా-46.8%, గ్రీస్-45.3%, శ్రీలంక-43.2%, మలేషియా-42.7%, థాయ్‌లాండ్-42.5%, ఈజిప్ట్-42.3%, ఖజకిస్తాన్-42.2%
ఫిలిప్పీన్స్-41.6%, టర్కీ-41.5%, ఉక్రెయిన్-41%, రష్యా-40.9%, ఇరాక్-40.8%, సుర్బియా-40%, సౌత్ కొరియా-38.2%, క్రయేషియా-37.9%, నార్త్ కొరియా-37.5%, కాంబోడియా-37.4%
అల్గేరియా -36.3%, ఫ్రాన్స్-36%, యూఏఈ-35.6%, రుమేనియా-35.2%, ఇజ్రాయిల్-35.2%, హంగేరి-34.8%, పాకిస్తాన్-33.6%, పోర్చుగల్-33.3%, జపాన్-33.2%, సౌదీ అరేబియా-31.2%, యునైటెడ్ స్టేట్స్-30.9%, ఆస్ట్రియా-30.4%, పోలాండ్-30.3%, జర్మనీ-29.9%
స్పెయిన్-29.1%, అర్జెంటీనా-28.2%, స్విట్జర్ ల్యాండ్-27.8%, సింగపూర్-27.8%, ఇటలీ-27.1%, బెల్జియం-26.9%, ఐర్లాండ్-26.1%, నెథర్లాండ్స్-25.6%, ఇరాన్-24.6%, కెనెడా-22.7%, బ్రెజిల్-21.5%, మెక్సికో-21.2%, యునైటెడ్ కింగ్డమ్21.1%, ఫిన్ ల్యాండ్-21%, ఆస్ట్రేలియా-18.7%, డెన్మార్స్-18.4%, నార్వే-15.5%
నైజేరియా-9%, ఇథియోపియా-8.3 శాతంగా ఉంది.