• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గంభీర్.. నిన్ను...

గంభీర్.. నిన్ను చంపేస్తాం.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ కు తీవ్ర బెదిరింపులు

| ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయిన గంభీర్.. తనను టార్గెట్ చేస్తూ ‘ఐ కిల్‌ యూ’ అంటూ రెండు మెయిల్స్‌ వచ్చాయని సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By - Tupaki Desk
Update: 2025-04-24 09:34 GMT

దేశం అంటే అపరిమితమైన ప్రేమను వ్యక్తం చేసే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు.. టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, మాజీ ఎంపీ అయిన గంభీర్ చాలా సందర్భాల్లో భారత దేశం పట్ల తనకున్న అత్యంత ప్రేమను చాటుకునేవారు. పాకిస్థాన్ అంటే తీవ్రమైన వ్యతిరేకతను కనబరిచేవారు. అంతేకాక, పాకిస్థాన్ క్రికెటర్లతో మైదానంలోనే కాదు ఆఫ్ ద ఫీల్డ్ కూడా వాదనలకు దిగేవాడు. ముఖ్యంగా పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదితో గంభీర్ కు ఉన్న వైరం గురించి తెలియనిది కాదు.

తాజాగా పహెల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య సంబంధాలు తీవ్రమైన ప్రభావానికి గురవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పాక్ ఉగ్రవాదం కారణంగానే పహెల్గాం దాడి జరిగిందని ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ నిర్ధారించింది.

ఈ క్రమంలో దేశభక్తిపరుడైన గంభీర్ కు బెదిరింపు మెయిల్స్ రావడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయిన గంభీర్.. తనను టార్గెట్ చేస్తూ ‘ఐ కిల్‌ యూ’ అంటూ రెండు మెయిల్స్‌ వచ్చాయని సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇవి ఎక్కడి నుంచి ఎవరు పంపారనే దానిపై సైబర్ సెల్ విచారణ చేపట్టింది.

పెహల్గాం ఉగ్రవాద దాడిపై గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మిగతా అందరు క్రికెటర్ల కంటే ముందుగా గంభీర్ స్పందించాడు. ఉగ్ర దాడి మృతుల తరఫున ప్రార్థిద్దాం. దీనికి బాధ్యులు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం. భారత్ తిప్పికొడుతుంది అని సందేశం ఇచ్చాడు. అందుకనే అతడికి బెదిరింపులు వచ్చినట్లు భావిస్తున్నారు.

రక్షణకు వినతి..

ఢిల్లీకి చెందిన గంభీర్ బీజేపీ మాజీ ఎంపీ కూడా కావడం గమనార్హం. 2019లో ఎంపీగా గెలిచినా.. 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. తా జాగా బెదిరింపుల నేపథ్యోంల తనకు రక్షణ కల్పించాలని అతడు ఢిల్లీ పోలీసులను కోరారు.

ఐసిస్ కశ్మీర్..

గంభీర్‌ కు ఐసిస్ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాతో పాటు అఫ్ఘానిస్థాన్ లో ఉనికి చాటిన ఐసిస్ కొంతకాలంగా భారత్ నూ టార్గెట్ చేసిందనే కథనాలు వచ్చాయి. ఇపుడు ఆ సంస్థ కశ్మీర్ విభాగం పేరిట గంభీర్ కు బెదిరింపులు రావడం గమనార్హం.

Tags:    
  • GautamGambhir 
  • TerroristThreat 
  • GautamGambhirSecurity 
  • ISISKashmir 
  • PahalgamTerrorAttack 
  • IndiaVsTerrorism 
  • GambhirResponse 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS