టీవీలు కట్టేయాల్సి వస్తోంది...మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్ !

టీవీలు చూడలేక కట్టేయాల్సి వస్తోంది అని ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు.

Update: 2026-06-26 03:51 GMT

టీవీలు చూడలేక కట్టేయాల్సి వస్తోంది అని ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. టీవీలలో పొలిటికల్ డిబేట్లు చూడలేకనే ఇలా చేయాల్సి వస్తోంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు లో తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వర్తమాన రాజకీయాల మీద సీరియస్ కామెంట్స్ నే చేశారు. రాజకీయాల్లో హుందాతనం రావాలని అన్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిన పరిస్థితులు ఉండాలని అన్నారు.

ఇతర రంగాలను చూసి :

సమాజంలో ఇతర రంగాలు పరస్పరం గౌరవించుకుంటున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. డాక్టర్లు లాయర్లు వంటి వారు తన వృత్తులలో పోటీ తత్వం ఉన్నా అంతా హుందాగా ఉంటున్నారని సమయం వచ్చినపుడు సహకరించుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు అన్నవి వ్యక్తిగతానికి పోతున్నాయని టీవీ డిబేట్లలో అయితే ఇంకా బాధాకరంగా ఉందని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో అయితే ఏకంగా అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు అని ఆయన ఎత్తి చూపుతున్నారు.

ఎక్కువగా బాధ్యతగా :

నిజానికి రాజకీయ రంగం అన్నది ఎక్కువ బాధ్యతగా ఉండాల్సినద్ది అని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజలకు సంబంధించిన రంగం అని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు సంబంధించిన అంశాలు అదే విధంగా పాలసీలు ఎలా చేయాలి అభివృద్ధి వంటి వాటి మీదనే నిర్మాణాత్మకమైన చర్చ జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ రాజకీయాల తీరు చూస్తే అలా కనిపించడం లేదని అన్నారు. దాంతోనే ఇబ్బంది వస్తోంది అన్నారు.

ఒకరిని ఒకరు తగ్గించుకుంటూ :

రాజకీయాల్లో ఒకరిని ఒకరు తగ్గించుకోవాలని చూడడం మంచిది కాదని ఆయన అన్నారు. ఒకరిని గౌరవించడం వల్లనే మనకు కూడా గౌరవం పెరుగుతుందని ఆయన చెప్పారు. అయితే కేవలం విమర్శల వల్ల అందునా పర్సనల్ గా టార్గెట్ చేయడం ఉపయోగం అయితే లేదని ఆయన అన్నారు. మరి ఉమ్మడి ఏపీని మూడేళ్ళ పాటు పాలించిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్న ఈ మాటలను రాజకీయ పార్టీలు నాయకులు పాటిస్తారా అన్నదే ఒక పెద్ద ప్రశ్న.

హైప్ క్రియేట్ చేయడమే :

సోషల్ మీడియా వచ్చాక స్మార్ట్ ఫోన్ల యుగంలో ఎక్కువ మంది జనాలకు రీచ్ కావాలన్న కోరిక అందరిలో బయల్దేరింది. దాంతో ప్రతీ ఒక్కరూ విమర్శలు చేయడం ధాటీగానే ఉంటోంది. అది హద్దులు మీరితే వారి పేరు ఇంకా రీ సౌండ్ చేస్తుందని ఎక్కడికో వెళ్ళిపోతుందని భావిస్తునారు. అందుకే ఈ షార్ట్ కట్ రూట్ ని నాయకులు ఎంచుకుంటున్నారు. ఇక గతానికి ఇప్పటికీ రాజకీయాల్లో తేడాలు వచ్చేశాయి. పాలిటిక్స్ లో సేవ అన్నది తగ్గిపోయి మిగిలిన ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. దాంతో ఎవరికి వారుగా జోరు చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ పాత నాయకులను ఆవేదనకు గురి చేస్తోంది.

Tags:    

Similar News