జగన్ క్రెడిట్ వార్ కి బాబు బిగ్ ట్విస్ట్ !
ఏపీలో క్రెడిట్ వార్ ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రారంభిస్తున్న కార్యక్రమాలు విషయంలో వైసీపీ ఆక్షేపిస్తూ విమర్శించడమే కాదు అవి తమ హయాంలోనే మొదలై నిర్మాణాలు జరుపుకున్నవని చెప్పుకొస్తోంది.
ఏపీలో క్రెడిట్ వార్ ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రారంభిస్తున్న కార్యక్రమాలు విషయంలో వైసీపీ ఆక్షేపిస్తూ విమర్శించడమే కాదు అవి తమ హయాంలోనే మొదలై నిర్మాణాలు జరుపుకున్నవని చెప్పుకొస్తోంది. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీగా క్రెడిట్ వార్ గట్టిగానే సాగుతూ వస్తోంది. తాజాగా చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. అయితే భోగాపురం ఎయిర్ పోర్టుని వైసీపీ హయాంలోనే అన్ని అనుమతులు తెచ్చి నిర్మాణం మొదలెట్టి చాలా వరకూ కంప్లీట్ చేశామని వైసీపీ నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జగన్ కూడా ఈ విషయంలో ట్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే దీని మీద తొలిసారిగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏలూరు జిల్లా కలిదిండిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిని తాను పాటుపడుతూంటే అన్నీ తానే చేశాను అని ఒక నాయకుడు అంటున్నాడు అని జగన్ మీద సెటైర్లు పేల్చారు.
విమానాశ్రయాన్ని కూటమి కట్టింది :
ఉత్తరాంధ్రలోని భోగాపురం విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హయాంలో తాము కడితే తానే పూర్తి చేసినట్లుగా వైసీపీ అధినేత జగన్ చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే కాదు రేపు పోలవరం పూర్తవుతుంది అది కూడా నేనే చేశాను అంటాడు అని ఎద్దేవా చేశారు. ఆఖరుకి రాజధాని అమరావతి పూర్తవుతుంది అయితే దాన్ని కూడా ఆయనే కట్టానంటాడు అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. తనకు నిర్మాణాలు చేయడం అభివృద్ధి చేయడం మాత్రమే తెలుసు అని ఆయన అన్నారు. అందుకే తమ హయాంలో అభివృద్ధి కనిపిస్తోంది అని అన్నారు. ఇక ఈ ఏడాదే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేస్తామని, వెలిగొండకు తానే శంకుస్థాపన చేశాను ఇక ఇదే నెలలోనే పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు నీళ్లు ఇస్తామని అన్నారు.
అరాచకమే తప్ప :
తాము అభివృద్ధితో ముందుకు సాగుతూంటే అరాచకమే తమ విధానంగా వైసీపీ తీరు ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ తనదైన దూకుడుతో స్వైర విహారం చేస్తోంది అని బాబు ఫైర్ అయ్యారు. ఆనాడు వివేకా హత్యలో నా ప్రమేయం ఉన్నట్లు చేతిలో కత్తిపెట్టారని ఆయన అన్నారు. అయితే తనకు కత్తులు పట్టుకునే అలవాటు లేదని బాబు అంటూ పోస్టుమార్టానికి కారణం అయిన వారు పోస్టు మార్టంతోనే పోతారు అని తీవ్రంగానే విరుచుకుపడ్డారు.
తెర దించినట్లేనా :
వైసీపీ తరచూ చేస్తున్న క్రెడిట్ వార్ కి తెర దించే విధంగానే బాబు ఈ విధంగా కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఏపీలో అభివృద్ధి అన్నది టీడీపీ చేస్తోంది అని ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే తాము చేసిన పనులను వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి చూడడం దారుణం అని జనాల మధ్యనే కామెంట్స్ చేస్తూ బాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి బాబు చెబుతున్నట్లుగానే వైసీపీ కూడా ఓపెన్ గా తాము ఫలానా చేశామని చెప్పి సవాల్ చేస్తుందా లేక ఏదైనా ప్రారంభోత్సవం జరిగినపుడు మాత్రమే హడావుడి చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇంతకీ క్రెడిట్ వార్ అన్నది ఇంతటితో ఆగుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు.