గాలిలో ఎగిరే అతి పెద్ద ఇంధన బాంబు
విమానం చూడటానికి బాగుంటుంది. అలాగే గాలిలో ప్రయాణిస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది.;
విమానం చూడటానికి బాగుంటుంది. అలాగే గాలిలో ప్రయాణిస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. కిటికీ దగ్గర కూర్చుని గగన వీక్షణం చేస్తే ఇంకా మజా ఎక్కువగా ఉంటుంది. ఒకనాడు మనిషికి నడక కూడా రాదు. మెల్లగా అన్నీ నేర్చుకుని ఈ రోజున విమానాలలో గగన విహారం చేస్తున్నాడు. వేల కిలోమీటర్లను గంటల వ్యవధిలో చేరుకుంటున్నాడు. ఖండాలను అన్నీ కలిపేసి భూలోక వీరుడిగా వెలుగొందుతున్నాడు.
ప్రతీ ప్రమోదం వెనకా ఒక ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రతీ అహ్లాదం వెనక అనర్ధం కూడా ఉంటుంది. ఎంత విమానం అయినా ఎంత రక్షణ ఉన్నా ఎంత టెక్నాలజీ ఉన్నా అది గాలిలో ఎగురుతుంది. ఈ ఒక్క ముక్క చాలు విమానం లో కూర్చున్న వారికి కానీ చూసేవారికి కానీ గుండె ఝల్లు మనడానికి.
అవును నిజమే ఏ ఆధారం లేకుండా గాలిలో ఎగురుతుంది విమానం. అయితే దానికి భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి అధిగమించే శక్తి ఉంటుంది అంతే కాదు భూమి మీద నుంచి కొన్ని వందల అడుగుల ఎత్తుకు వెళ్ళాక ఆ గురుత్వాకర్షణ శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో విమానం స్థిరత్వం సంపాదిస్తుంది. అలా గగనతలం మీద సాఫీగా ఎగిరిపోతుంది. ఒక పక్షిగా విహారం చేస్తుంది.
అయితే విమానం ప్రయాణించేందుకు ఇంధనం కావాలి. ఇక విమానంలో అనేక సైజులు ఉన్నాయి. బోయింగ్ విమానాలు అతి పెద్దవి. వాటి కెపాసిటీ కూడా ఎక్కువ. ఇవి ఒకేసారి వందల మందిని ఎక్కించుకుని ఖండాంతరలకు గంటల తరబడి ప్రయాణించగలవు. మరి ఆ దూరాన్ని భారాన్ని తట్టుకోవాలంటే ఎంత ఇంధనం వాటికి అవసరం అవుతుంది అంటే లక్షల లీటర్లే అని అంటున్నారు.
ఒక బోయింగ్ విమానం కెపాసిటీ లక్ష లీటర్ల ఇంధనాన్ని తనలో దాచుకునే విధంగా ఉంటుంది. ఇక అహ్మదాబాద్ లో కుప్పకూలిన బోయింగ్ విమానం చూస్తే లక్షా పాతిక వేల లీటర్ల ఇంధనం స్టోర్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంది. పైగా ఇది టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కుప్ప కూలింది. దాంతో పెద్దగా ఇంధనం ఖర్చు కాలేదు. దాంతో లక్షల లీటర్లు అలాగే ఉన్నాయి.
మరో వైపు చూస్తే ఈ బోయింగ్ విమానం గంటకు దాదాపు అయిదు వేల లీటర్ల ఇంధనం వాడుతుంది. లండన్ కి పది గంటల ప్రయాణంగా ఉంది. అంటే అరవై వేల లీటర్ల ఇంధనం ఒక పక్కకు ఖర్చు అవుతుంది అన్న మాట. రెండవ పక్కకు కూడా ఇంధనం సమకూర్చుకునే విధంగా లక్షా పాతిక వేల లీటర్ల ఇంధనం ఇందులో నింపుతారు. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటారు.
దాంతో ఫ్యూయల్ ట్యాంకర్ చూస్తే నిండుగా ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా లేక నేలను విమానం ఢీ కొట్టినా లేక చెట్లను ఢీ కొట్టినా విమానమంలోని ఫ్యూయల్ ట్యాంకులు బద్ధలవుతాయి. ఇక ఇవి మండే స్వభావంతో ఉంటాయి. అంతే ఒక్కసారిగా మంటలు అంటుకుని అతి పెద్ద ఫ్యూయల్ బాంబుగా మారిపోతాయి.
దాంతో అక్కడ ఒకేసారి వేయి డిగ్రీల సెల్సియస్ కి మించి ఉష్ణోగ్రతలు వెదజల్లుతాయి. ఆ పరిసరాలకు కూడా ఎవరూ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. తాజాగా అహ్మదాబాద్ విమానం కూడా అలాగే కుప్ప కూలింది. ఇంతటి దారుణమైన ప్రమాదం జరగబట్టే అందులో నుంచి ఎవరూ బయటకు రాలేకపోయారు.
విమానంలో ఉండేవారే కాదు, ప్రమాదం జరిగినపుడు చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే గురువారం జరిగింది విమాన ప్రమాదం మాత్రమే కాదు ఒక అతి పెద్ద ఫ్యూయల్ బాంబు భారీ విస్ఫోటం పేలింది అన్న మాట. ఊహించుకుంటేనే భయం కలిగించే విధంగా ఈ సంఘటన ఉందనిపిస్తోంది.