వివాహేతర సంబంధాల్లో వారే టాప్.. ఫస్ట్ ప్లేస్ లో మన పక్క నగరం!

అవును... ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో గ్లీడెన్ అనే సంస్థ ఈ వివాహేతర సంబంధాలపై ఓ అధ్యయనాన్ని నిర్వహించింది.;

Update: 2025-10-25 06:21 GMT

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు మరింత విచ్చలవిడిగా పెరిగిపోయాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తొడు ఈ సంబంధాల కారణంగా పెరుగుతున్న నేరాలు-ఘోరాలు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఘటనలే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే ఈ విషయంలో సంచలన విషయాలు వెల్లడించింది.

అవును... ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో గ్లీడెన్ అనే సంస్థ ఈ వివాహేతర సంబంధాలపై ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... వివాహేతర సంబంధాల విషయంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది.

ఐటీ, వైద్య రంగంలో ఉన్న వారే ఎక్కువ..!:

గ్లీడెన్‌ సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనంలో తర్వాత స్థానాల్లో ముంబయి, కోల్‌ కతా, ఢిల్లీ, పుణె నిలిచాయి. ఈ క్రమంలో... ఈ వివాహేతర సంబంధాలు పెరిగిపోవడంతోనే విడాకులు, కుటుంబ కలహాల సంఖ్య ఎక్కువైందని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా... ఐటీ, వైద్య రంగంలో ఉన్న వారిలోనే ఇతరుల కన్నా ఎక్కువగా ఈ సంబంధాలు పెట్టుకుంటున్నారని తెలిపింది!

ఇటీవల కాలంలో ఆశలకు తగ్గట్లుగా అవసరాలు తీర్చకపోవడం, భావోద్వేగ అసంతృప్తితో పాటు దంపతుల మధ్య సాన్నిహిత్యం కొరవడటం వల్ల ఈ తరహా సంబంధాలు పెరిగిపోతున్నాయని నిపుణులు, విడాకుల న్యాయవాదులు అంటున్నారు. గ్లీడెన్ ఇండియా వివాహేతర డేటింగ్ యాప్ వినియోగదారులలో బెంగళూరు వాటా 17 శాతం మంది అని చెబుతున్నారు.

30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గలవారే..!:

ఈ యాప్ లోని వినియోగదారుల్లో సుమారు 65 శాతం మంది పురుషులు కాగా 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గలవారని అంటున్నారు. ఈ యాప్ తాజా అధ్యయనం కోసం 12 నగరాల్లో 18 - 60 ఏళ్ల మధ్య వయసుగల 1,510 మందిని సర్వే చేసింది.

సోషల్ మీడియాలో సరసాలు..!:

ఈ సర్వేలో... బెంగళూరులో 29 శాతం మంది సోషల్ మీడియాలో సరసాలాడినట్లు అంగీకరించగా.. 53 శాతం మంది ఏదో ఒక రకమైన అవిశ్వాసాన్ని నివేదించగా... ఇందులో 7 శాతం శారీరకంగా, 12 శాతం భావోద్వేగంగా, 34 శాతం రెండూ విధాలుగాను అని తెలిపారు. తక్కువ సమయం కేటాయించడం, వారి అవసరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతోనే ఈ సమస్య అని అంటున్నారు.

వ్యభిచారం కేసులు 40 శాతం పెరిగాయి!:

ఈ సందర్భంగా... మహిళల భద్రత, లింగ సమానత్వంపై దృష్టి సారించిన లాభాపేక్షలేని సంస్థ దుర్గా ఇండియా వ్యవస్థాపకురాలు ప్రియా వర్ధరాజన్ స్పందిస్తూ... గత ఐదు సంవత్సరాలలో వ్యభిచారం కేసులు 40 శాతం పెరిగాయని పేర్కొన్నారు. మహిళలు తమ వద్దకు వచ్చినప్పుడు, చాలా మంది మొదట్లో భావోద్వేగ దూరం, సాన్నిహిత్యం లేకపోవడాన్ని ప్రస్తావిస్తారని తెలిపారు.

పురుషులే కాదు, స్త్రీలు కూడా..!:

ఇదే క్రమంలో స్పందించిన న్యాయవాది కుసుమ్ రంగనాథన్... ఐదేళ్లలో వ్యభిచారం సంబంధిత విడాకులు 25 నుంచి 30 శాతం పెరిగాయని అంటున్నారు. పురుషులే కాదు, స్త్రీలు కూడా వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారని ఆమె పేర్కొనారు. టెక్నాలజీ మోసం చేయడంతోపాటు దాన్ని బహిర్గతం చేయడాన్ని సులభతరం చేసిందని ఆమె తెలిపారు.

Tags:    

Similar News