పుట్టగొడుగులతో అత్తమామలను పొట్టన పెట్టుకున్న మహిళ.. ఎక్కడో ఏంటో తెలిస్తే షాక్!

ఇక ఈ ఆహారం తిన్న ఆ నలుగురు మరుసటి రోజు ఉదయాన్నే జీర్ణ సంబంధిత ఇబ్బందులతో హాస్పిటల్ లో చేరారు.;

Update: 2025-08-08 18:30 GMT

ఆస్ట్రేలియాలో గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక కేసుకు సంబంధించి తాజాగా విచారణ పూర్తయింది. ఈ కేసులో రెండు సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. సొంత అత్తమామలను, భర్తను విషపు పుట్టగొడుగులను ఆహారంలో కలిపి వండి కడతేర్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని ఎరిన్ ప్యాటర్సన్ అనే మహిళ 2007లో సైమన్ ని పెళ్లి చేసుకుంది.ఆ కొద్ది రోజులు కలిసి ఉన్న ఈ జంట 2015లో విడిపోయారు.

విడాకులు తీసుకున్నాక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న ఎరిన్ ప్యాటర్సన్ దాదాపు 10 ఏళ్ల తర్వాత తన మాజీ అత్తమామలు అయినటువంటి సైమన్ తల్లిదండ్రులని 2023 జూలైలో మెల్బోర్న్ నుండి 85 మైళ్ళ దూరంలో ఉన్న లియోంగాథా అనే చిన్న పట్టణంలోని తన ఇంటికి మాజీ అత్తమామలు, భర్తను భోజనానికి పిలిచింది. మాజీ కోడలు, మాజీ భార్య పిలిచిందనే నేపథ్యంలో సైమన్ తన తల్లిదండ్రులతో పాటూ తన తల్లి చెల్లి తో కలిసి నలుగురు విందుకు వెళ్లారు. కానీ ఆ భోజనంలో విషపు పుట్టగొడుగులను కలిపి బీఫ్ వెల్డింగ్టన్ తో వడ్డించింది. ఇక ఈ డెత్ క్యాప్ పుట్టగొడుగులు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి. అయితే వాళ్లని చంపాలనే ప్లాన్ తోనే ఎరిన్ ప్యాటర్సన్ వచ్చిన నలుగురు అతిథులకు డెత్ క్యాప్ పుట్ట గొడుగులు కలిపిన ఆహారాన్ని వడ్డించింది.

ఇక ఈ ఆహారం తిన్న ఆ నలుగురు మరుసటి రోజు ఉదయాన్నే జీర్ణ సంబంధిత ఇబ్బందులతో హాస్పిటల్ లో చేరారు. అందులో ముగ్గురు అమనిటా పుట్టగొడుగు విష ప్రయోగం కారణంగా కాలేయ పనితీరులో మార్పు అలాగే బహుళ అవయవ వైఫల్యాలు కారణంగా మరుసటి వారమే మరణించారు. అలా మరణించిన వారిలో సైమన్ తల్లిదండ్రులతో పాటు సైమన్ పిన్ని కూడా మరణించారు.. కానీ కొన్ని వారాల తరబడి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న తర్వాత ప్రాణాలతో బయటపడిన సైమన్.. ఆరోగ్యంగా బయటకు తిరిగి వచ్చి విక్టోరియా రాష్ట్ర సుప్రీం కోర్టులో విషపూరిత పుట్టగొడుగులతోనే చంపాలని ప్రయత్నం చేసిందని సాక్ష్యం చెప్పారు..

దాంతో ఎరిన్ ప్యాటర్సన్ ని నిందితురాలిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 50 మందికి పైగా సాక్ష్యులను ప్రవేశపెట్టి ఇందులో ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టారు. అయితే ఎరిన్ విడాకులు తీసుకున్న తర్వాత తన భర్త నుండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో కావాలనే తన అత్తమామలను చంపాలని నిర్ణయించుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వాదించారు.మూడు హత్య నేరాలు అలాగే ఒక హత్యాయత్న నేరానికి పాల్పడినట్లు తెలిపారు.

ఈ విషయంపై మొదట ఎరిన్ ప్యాటర్సన్ అంగీకరించలేదు. నేను కావాలని విషపు పుట్టగొడుగులు ఆహారంలో వండలేదని, పొరపాటున అవి ఆహారంతో కలిశాయని చెప్పింది.కానీ ఎరిన్ ప్యాటర్సన్ అబద్దాలు చెప్పిందని తేలడంతో తాజాగా ఎరిన్ ప్యాటర్సన్ ని దోషిగా తేల్చారు జస్టిస్ క్రిస్టోఫర్ బీల్.. ఇక ఎరిన్ ప్యాటర్సన్ కి సంబంధించి మరో విషయం కూడా బయటపడింది. అదేంటంటే ఆమె తన అత్తమామల్ని మాత్రమే కాదు తన భర్తకి కూడా పలుమార్లు విషం కలిపిన ఆహారం ఇచ్చి చంపడానికి ప్రయత్నించినట్టు పోలీసులు ఆరోపించారు. ఇక ముగ్గురిని హత్య చేసిన కేసులో ఎరిన్ ప్యాటర్సన్ దోషిగా తేలినప్పటికీ ఆమెకు శిక్ష ఇంకా ఖరారు కాలేదు. ఆగస్టు 25న ఎరిన్ కి శిక్ష ఖరారు చేయబోతున్నారు.

Tags:    

Similar News