ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టలేదు..ఉద్యోగికి రూ. 3.41 కోట్ల రిటైర్మెంట్ గిఫ్ట్‌

ఒక వ్యక్తి ఒకే సంస్థలో ఏకంగా 27ఏళ్లు పని చేశాడు. విశేషం ఏంటంటే తను ఆఫీసుకు ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు.;

Update: 2025-04-21 15:30 GMT

ఒక వ్యక్తి ఒకే సంస్థలో ఏకంగా 27ఏళ్లు పని చేశాడు. విశేషం ఏంటంటే తను ఆఫీసుకు ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. అతని నిబద్ధతకు ప్రతిఫలంగా రిటైర్మెంట్‌లో అతడికి ఊహించని బహుమతిని లభించింది. అక్షరాలా రూ. 3.41 కోట్లు (4 లక్షల డాలర్లు)ను తనకు అందాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఆ వ్యక్తి ఎవరో వివరంగా తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన కెవిన్ ఫోర్డ్ అనే వ్యక్తి బర్గర్ కింగ్ రెస్టారెంట్లో 27ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఈ సుదీర్ఘ కాలంలో తను ఒక్కటంటే ఒక్క రోజు కూడా తన పనికి గైర్హాజరు కాలేదు. తన ఉద్యోగం పట్ల అతడికున్న అంకితభావం, క్రమశిక్షణ అలాంటిది. ఇటీవలె కెవిన్ రిటైర్ అవుతున్న సందర్భంగా అతడి సహోద్యోగులు, ప్రజలు కలిసి అతడికి రిటైర్మెంట్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. .

వారు గోఫండ్‌మీ (GoFundMe) అనే ఆన్‌లైన్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ మీద ఓ పేజీని క్రియేట్ చేశారు. కెవిన్ ఫోర్డ్ అంకితభావం గురించి, అతని కష్టపడే తత్వం గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఊహించని విధంగా ప్రజలు పెద్ద మొత్తంలో విరాళాలను అందించడం మొదలు పెట్టారు. లక్ష డాలర్లు, రెండు లక్షల డాలర్లు దాటి, ఏకంగా నాలుగు లక్షల డాలర్ల (సుమారు రూ. 3.41 కోట్లు) మేరకు విరాళాలు పోగయ్యాయి.

ఈ భారీ మొత్తాన్ని కెవిన్ కు రిటైర్మెంట్ గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించారు. గిఫ్ట్ అందుకున్న కెవిన్ ఆనందానికి అవధులు లేవు. 27 ఏళ్లుగా తన జీవితాన్ని బర్గర్ కింగ్‌కు అంకితం చేసినందుకు ఇంత మంచి గుర్తింపు లభించడం నిజంగా గొప్ప విషయం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని కెవిన్ ఫోర్డ్ ప్రస్తానం నిరూపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో మంది నెటిజన్లు కెవిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Tags:    

Similar News