మినీ సంగ్రామం 2026: ఐదు రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్‌డేట్స్!
ఐదు రాష్ట్రాల్లో ఫలితాల ఉత్కంఠ!
ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏ రాష్ట్రంలో గెలుపెవరిది? ఎక్కడ ఒటమి ఎవరిది? ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రతి తాజా అప్‌డేట్ Tupaki.com మీకు అందిస్తోంది.
పుదుచ్చేరిలో **ఎన్‌డీఏ** స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతుండటంతో **ఎన్. రంగస్వామి** ఐదోసారి సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే నేతగా గుర్తింపు పొందిన ఆయన అవివాహితుడు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. 1991లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దశాబ్దం లోపే సీఎం అయ్యారు. **కాంగ్రెస్** నుంచి బయటకు వచ్చి 2011లో **ఏఐఎన్‌ఆర్‌సీ**ను స్థాపించారు. 2016లో ఓటమి ఎదురైనా, తర్వాతి ఎన్నికల్లో బలమైన కంబ్యాక్ ఇచ్చారు. తాజా లెక్కల్లో 30 సీట్లలో **బీజేపీ–AINRC కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బెంగాల్‌లో **భారతీయ జనతా పార్టీ** ఘన విజయానికి దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు కోల్‌కతాలోని **మమతా బెనర్జీ** ఇంటి బయట ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బెంగాల్‌లో మమత పాలనకు తెరపడిందని, ఇకపై రామరాజ్యం ఎలా ఉంటుందో చూడబోతున్నామంటూ పలువురు నేతలు వ్యాఖ్యానించారు.
#TNElections2026 Lead:
#TVK - 109
#AIADMK - 55
#DMK - 52
#Congress - 4
**పశ్చిమ బెంగాల్**లో చరిత్ర నమోదైంది. **భారతీయ జనతా పార్టీ** 174 స్థానాల్లో ఆధిక్యంతో ముందంజలో నిలిచి, **తృణమూల్ కాంగ్రెస్**ను వెనక్కి నెట్టింది. 15 ఏళ్ల **మమతా బెనర్జీ** పాలనకు ముగింపు. **నరేంద్ర మోదీ**, **అమిత్ షా** ప్రచారాలు ఫలించాయి. తొలిసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది.
తమిళనాడులో ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం #MKStalin కొళత్తూర్ నియోజకవర్గంలో, అలాగే డిప్యూటీ సీఎం #UdhayanidhiStalin చెపాక్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నట్లు సమాచారం.
ఈ రెండు కీలక సీట్లలో కొత్త రాజకీయ శక్తి #TamilagaVettriKazhagam (TVK) ఆధిక్యంలో కొనసాగుతోంది.
చెన్నైలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో గాను 12 సీట్లలో TVK ముందంజలో ఉండటం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం రాష్ట్ర స్థాయిలో #TVK 103 స్థానాల్లో, #AIADMK 72 స్థానాల్లో, #DMK 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఫలితాలు తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో #TamilagaVettriKazhagam (TVK) గెలుపు దిశగా సాగుతున్న వేళ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పార్టీ అధినేత #Vijay నివాసానికి హీరోయిన్ #TrishaKrishnan చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
ఈ సందర్భంగా త్రిష తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని విజయ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇవాళ త్రిష పుట్టినరోజు కావడం ఈ పరిణామానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ముందంజలో దూసుకెళ్తోంది. పార్టీ గుర్తు ‘విజిల్’ను ఊదుతూ విజయ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
మమతా బెనర్జీ ఫలితాల సమయంలో వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పటివరకు కేవలం మూడు రౌండ్ల లెక్కింపే పూర్తయ్యిందని ఆమె తెలిపారు. ‘సర్’ పేరుతో ఓట్లు దొంగిలించారని బీజేపీపై ఆరోపణలు చేశారు. తుది ఫలితాలు తమకు అనుకూలంగా మారుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ : 187 ఆధిక్యం
టీఎంసీ : 100 ఆధిక్యం
లెఫ్ట్ : 2 ఆధిక్యం
కాంగ్రెస్ : 1
ఇతరులు : 3