75 ఏళ్ల రంగస్వామి.. మళ్లీ సీఎం కిరీటం!

పుదుచ్చేరిలో **ఎన్‌డీఏ** స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతుండటంతో **ఎన్. రంగస్వామి** ఐదోసారి సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే నేతగా గుర్తింపు పొందిన ఆయన అవివాహితుడు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. 1991లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దశాబ్దం లోపే సీఎం అయ్యారు. **కాంగ్రెస్** నుంచి బయటకు వచ్చి 2011లో **ఏఐఎన్‌ఆర్‌సీ**ను స్థాపించారు. 2016లో ఓటమి ఎదురైనా, తర్వాతి ఎన్నికల్లో బలమైన కంబ్యాక్ ఇచ్చారు. తాజా లెక్కల్లో 30 సీట్లలో **బీజేపీ–AINRC కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Update: 2026-05-04 09:12 GMT

Linked news