తమిళనాడులో రాజకీయ షాక్; తండ్రీకొడుకుల వెనుకంజ

తమిళనాడులో ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం #MKStalin కొళత్తూర్ నియోజకవర్గంలో, అలాగే డిప్యూటీ సీఎం #UdhayanidhiStalin చెపాక్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నట్లు సమాచారం.

ఈ రెండు కీలక సీట్లలో కొత్త రాజకీయ శక్తి #TamilagaVettriKazhagam (TVK) ఆధిక్యంలో కొనసాగుతోంది.

చెన్నైలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో గాను 12 సీట్లలో TVK ముందంజలో ఉండటం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం రాష్ట్ర స్థాయిలో #TVK 103 స్థానాల్లో, #AIADMK 72 స్థానాల్లో, #DMK 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఫలితాలు తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Update: 2026-05-04 08:07 GMT

Linked news