భయం కాదు… భరోసానే పనిచేస్తుంది..ధియేటర్స్ లో యాడ్స్ గేమ్ చేంజ్

సినిమా థియేటర్లలో సినిమా మొదలయ్యే ముందు వచ్చే స్మోకింగ్, క్యాన్సర్ యాడ్స్ మనందరికీ తెలిసిందే.

Update: 2026-06-21 12:30 GMT

సినిమా థియేటర్లలో సినిమా మొదలయ్యే ముందు వచ్చే స్మోకింగ్, క్యాన్సర్ యాడ్స్ మనందరికీ తెలిసిందే. అయితే, భయపెట్టే ఆ పాత యాడ్స్ చూసి జనాలు మారకపోగా, చిరాకుపడి ఫోన్లు చూసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. చెడు అలవాట్లను తిట్టడం పక్కనబెట్టి, మంచి ఆహార అలవాట్లపై థియేటర్లలో పాజిటివ్ యాడ్స్ వేస్తూ ఒక సరికొత్త గేమ్ చేంజ్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

భయపెట్టే మార్కెటింగ్‌కు కాలం చెల్లింది:

దశాబ్దాలుగా "సిగరెట్ తాగితే చచ్చిపోతారు" అని భయంకరమైన విజువల్స్ చూపించడం ఒక పద్ధతిగా వస్తోంది. కానీ సైకాలజీ ప్రకారం.. మనుషులు విపరీతమైన భయాన్ని లేదా జుగుప్స కలిగించే దృశ్యాలను చూసినప్పుడు, వారి మైండ్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అందుకే జనాలు ఆ స్క్రీన్ వైపు చూడటం మానేశారు. పైగా గతంలో వచ్చిన కొన్ని స్మోకింగ్ యాడ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాయి తప్ప, వాటి వల్ల ఆశించిన మార్పు రాలేదు.

భయం కలిగించడం కాదు.. బాధ్యత గుర్తు చేయడం:

ఇక్కడే ఏపీ ప్రభుత్వం తన విధానం మార్చింది. చెడును వదిలేయమని ఒత్తిడి తెచ్చే కంటే.. మంచి అలవాట్ల వల్ల వచ్చే లాభాలను ఆహ్లాదకరంగా చూపించడం మొదలుపెట్టింది. నూనె పదార్థాలకు దూరంగా ఉండటం, చిరుధాన్యాలు ప్రాధాన్యత, ఉప్పు వాడకం తగ్గించడం వంటి విషయాలపై సృజనాత్మకంగా యాడ్స్ డిజైన్ చేయించింది. "ఇవి తింటే మీ కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది" అనే భరోసాను ఇవ్వడం వల్ల ఇవి జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫోకస్:

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మధ్య కాలంలో ప్రజల ఆహార అలవాట్లపై ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. బయటి జంక్ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే పిల్లలు, పెద్దలు అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నేరుగా చెబితే వినని జనానికి, థియేటర్లలో ప్రశాంతంగా కూర్చునే సమయంలో ఈ సానుకూల సందేశాలను అందిస్తున్నారు. ఇక మొదట మెయిన్ సెంటర్లలో మొదలైన ఈ యాడ్స్, త్వరలోనే బి, సి సెంటర్ల థియేటర్లలో కూడా తప్పనిసరి కానున్నాయి.

నెగెటివ్ ప్రచారం కన్నా పాజిటివ్ ప్రచారమే సమాజంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. థియేటర్లను వేదికగా చేసుకుని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఈ సరికొత్త హెల్తీ ప్రయోగం గనుక ఇక్కడ సక్సెస్ అయితే, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఇక ఏదేమైనా, భయపెట్టడం కంటే భరోసా ఇవ్వడమే మార్పునకు తొలి అడుగు అని ఈ సరికొత్త థియేటర్ యాడ్స్ నిరూపిస్తున్నాయి.

Tags:    

Similar News