దువ్వాడ వాణి.. ఫుల్ స్వింగ్‌!

టెక్కలి జిల్లా ప‌రిష‌త్ స‌భ్యురాలైన దువ్వాడ వాణి వ్య‌క్తిగ‌తంగా, అదేవిధంగా వైసీపీ ప‌రంగా కూడా దూకుడు పెంచారు.;

Update: 2025-06-30 03:00 GMT

వైసీపీ నాయ‌కుడ‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స‌తీమ‌ణి దువ్వాడ వాణి గురించి అంద‌రికీ తెలిసిందే. కుటుంబ క‌లహాల క్ర‌మంలో ఆమెపేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. మాధురి అనే మ‌హిళ‌తో దువ్వాడ రిలేష‌న్ షిప్ పెట్టుకున్న క్ర‌మంలో వాణి మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆమె గ‌త ఎన్నిక‌ల్లో టెక్క‌లి నుంచి కూడా పోటీ చేయించేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేసింది. తాజాగా వీరి కుటుంబంలో సంగ‌తులు ఎలా ఉన్నా.. తాజాగా వాణి రాజ‌కీయంగా దూకుడు పెంచారు.

టెక్కలి జిల్లా ప‌రిష‌త్ స‌భ్యురాలైన దువ్వాడ వాణి వ్య‌క్తిగ‌తంగా, అదేవిధంగా వైసీపీ ప‌రంగా కూడా దూకుడు పెంచారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్కలి మండలంతో పాటు చాలా చోట్ల సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎవ‌రూ త‌ప్పు చేయ‌క‌పోయినా.. టీడీపీ నాయ‌కులు త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఆమె నిరాహార దీక్ష‌కు దిగుతున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ ఒక్క కార‌ణంతోనే కాకుండా.. స్థానికంగా కూడా అభివృద్ధికి నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు.

అదేవిధంగా అధికారులు త‌మ‌ చెక్‌పవర్‌ రద్దు చేస్తున్నారని దువ్వాడ వాణి ఆరోపించారు. కీల‌క‌మైన ఉపాధి హామీ ప‌థ‌కంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలిగిస్తున్నారని కూడా వాణి ఆరోపించారు. రాజ‌కీయ ఒత్తిళ్ల‌తో త‌మ‌పై అధికారులు పెత్త‌నం చేస్తున్నార‌ని ఆరోపించిన వాణి.. తాను నిరాహార దీక్ష‌కు దిగుతున్న‌ట్టు పేర్కొన్నారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా ఆస‌క్తిగా రియాక్ట్ అయ్యారు. వాణికి మ‌ద్ద‌తుగా తాము కూడా నిరాహార దీక్ష‌కు దిగ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. దీంతో దువ్వాడ వాణి పాలిటిక్స్ ఊపందుకున్నాయి.

Tags:    

Similar News