"చిరంజీవికి సీఎం అయ్యే ఛాన్స్"పై దువ్వాడ రియాక్షన్ వైరల్!
తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీతో, మెగాస్టార్ తో తనకున్న అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి వైరల్ గా మారాయి.;
దువ్వాడ శ్రీనివాస్.. చిరంజీవి రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి వ్యాఖ్యానించినట్లు కనిపించని దువ్వాడ శ్రీనివాస్... తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీతో, మెగాస్టార్ తో తనకున్న అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి వైరల్ గా మారాయి.
అవును... గత కొంతకాలంగా దివ్వెల మధురితో కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న దువ్వాడ శ్రీనివాస్... తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో మెగాస్టార్ చిరంజీవితో, పీఆర్పీ అధినేత చిరంజీవితో నాడు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో... చిరంజీవికి సీఎం అయ్యే ఛాన్స్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్కిలిలో 2009లో ఉప ఎన్నిక జరిగినప్పుడు తన నామినేషన్ కు చిరంజీవి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2009 ఎన్నికల్లో తాను స్వల్ప మెజారిటీతో ఓటమి పాలై, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో... చిరంజీవి తనకు డబ్బులు పంపించారని, అలాంటి గొప్ప వ్యక్తిత్వం చాలా అరుదని, అది చిరంజీవి గొప్ప వ్యక్తిత్వం అని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఇదే సమయంలో... ప్రజారాజ్యం పార్టీ విలీన సమయంలో తనకు కబురు పెట్టినప్పుడు.. విలీనం వద్దనే తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే... ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకుండా చిరంజీవి అప్పుడు రాజకీయాలలో కొనసాగి ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారని దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఎంతగానో కొనియాడుతూ దువ్వాడ మాట్లాడారు. ఎంతో గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి సీఎం కాలేకపోయారని అన్నారు.