• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వెండి కప్పుల్లో 24...

వెండి కప్పుల్లో 24 క్యారెట్స్ బంగారు టీ... ఏమి'టీ'ది?

| భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అంతకు మించి అనేవారు ఎక్కువే.

By - Tupaki Desk
Update: 2025-06-21 19:30 GMT

భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అంతకు మించి అనేవారు ఎక్కువే. చాయ్ లేదా టీ అనేది చాలా మంది భారతీయుల రోజువారీ జీవితంలో అంతర్భాగం. ఈ సమయంలో... అల్లం టీ, బెల్లం టీ నుంచి మొదలు ఇరానీ ఛాయ్, తందూరీ చాయ్, మసాలా చాయ్, ఇలాచీ చాయ్, బాదం చాయ్, మొదలైన ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉంటాయి.

ఈ క్రమంలో ప్రతీ రోజు ఉదయం టీ తోనే రోజు స్టార్ట్ చేసేవారు.. ఆఫీసులో ఉంటే రోజుకి కనీసం రెండు మూడు సార్లు ఆ తేనీటిని జిహ్వకు రుచి చూపించేవారు చాలా మందే ఉంటారు. ఈ క్రమంలో ఒక టీకి ఎంత ధర చెల్లిసారు? రోడ్డుపై బండి దగ్గర కనీసం రూ.10 నుంచి టీ ధర స్టార్ట్ అవుతుందనుకుంటే స్టార్ హోటల్స్ లో రూ.500 - 750 మధ్య ఉంటుంది!

ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే... అల్లం, బెల్లం, ఇలాచీ, బాదం ఇలాంటివి కాకుండా రొటీన్ కి భిన్నంగా, ఎవరూ ఊహించని టీని అందిస్తోంది దుబాయ్ లోని ఓ హోటల్. దాన్ని 24 క్యారెట్స్ బంగారంతో తయారు చేస్తుండటం గమనార్హం. దీన్ని వెండికప్పులో అందిస్తారు. అయితే.. ఈ గోల్డ్ టీ ధర దాదాపు లక్ష రూపాయలు పైనే (5,000 దిరామ్స్)!

అవును.. ఒక సగటు భారతీయుడు ఒక కప్పు చాయ్ కోసం ఎంతవరకూ ఖర్చు చేయవచ్చు? రూ.10 నుంచి రూ.1000 వరకూ అనుకున్నా... దుబాయ్ కేఫ్ లో మాత్రం ఈ కప్పు టీ ధర లక్ష రూపాయలు. అదే గోల్డ్ టీ. డీ.ఐ.ఎఫ్.సీ. ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లోని భారతీయ సంతతికి చెందిన సుచేతా శర్మ నడుపుతున్న కేఫ్ లో ఈ 'గోల్డ్ కరక్ టీ' దొరుకుతోంది.

అంతేకాదండోయ్... ఈ కేఫ్ లో బంగారంతో నింపిన క్రోసెంట్స్, బంగారు నీరు, బంగారు బర్గర్లు, బంగారు ఐస్ క్రీం వంటి ఇతర బంగారుతో నింపిన ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి. ఈ విషయం సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది. దీని ధర విన్న నెటిజన్లు... ఈఎంఐ ఆప్షన్ గురించి అడుగుతుండటం గమనార్హం.

Tags:    
  • GoldTea 
  • LuxuryTea 
  • DubaiTrends 
  • IndianChai 
  • TeaLovers 
  • KarakTea 
  • ChaiObsession 
  • GoldLuxury 
  • TeaTime 
  • DubaiGoldTea 

Similar News

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS