చావు ఎప్పుడొస్తుందో తెలుసా?

ఓ సర్వే ప్రకారం మనిషి మరణంపై మెల్లగా నిజాలు వెల్లడవుతున్నాయి.

Update: 2023-12-24 07:30 GMT

వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు. అందుకే వాటి సమయం గురించి ఎవరికి తెలియదు. కానీ ప్రస్తుతం సాంకేతికత పెరిగింది. పరిజ్ణానం ఇనుమడించింది. దీంతో మనిషి పుట్టుక, చావు గురించి కొంతవరకు తెలుసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి మనకు తెలుసు. చాట్ జీపీటీ టెక్నాలజీతో అన్ని మార్గాల్లో సమూల మార్పులు జరిగాయి. ఓ సర్వే ప్రకారం మనిషి మరణంపై మెల్లగా నిజాలు వెల్లడవుతున్నాయి.

శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియాల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో అల్గారిథమ్ తయారు చేశారు. దాని ఆధారంగా మనిషి ఎప్పుడు మరణిస్తాడని అంచనా వేస్తున్నారు. చాట్ జీపీటీ, బింగ్ ఏఐ, గూగుల్ బార్ట్ తరహాలో లైఫ్2వీఈసీ పేరుతో పిలిచే మేథతో మనకు చావు ఎప్పుడు ముంచుకొస్తుందో ముందే పసిగడుతుందట. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లో శిక్షణ పొందిన టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, యూఎస్ రిసెర్సర్లు ఏఐ ఆధారిత డెత్ ప్రిడెక్టర్ ను తయారు చేశారు.

సుమారు ఆరు లక్షల మందిపై సర్వే నిర్వహించారు. వారి ఆదాయం, పని, ప్రమాదాలు తదితర విషయాలపై వారి మరణంపై అంచనా వేశారు. ఇందులో ఎవరి మరణం ఎప్పుడు వస్తుందనే దానిపై మానసిక ఆరోగ్యం, నైపుణ్యం, జీతం, నాయకత్వం వంటి వాటితో ముందస్తు మరణాలకు కారణమవుతున్నాయి. యూజర్లు చాట్ జీపీటీని ఓపెన్ చేసి అందులో క్రోడింగ్ గురించి లేదంటే ఏదైనా చరిత్ర గురించి ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ లైఫ్ 2 వీఈసీలో ఎప్పుడు మరణిస్తారని అడుగుతారు.

మన మరణం ఎప్పుడు అనేది తెలియజేస్తుండటంతో పెరిగిన సాంకేతికతతో మన చావు ఎప్పుడు వస్తుందో డెత్ గురించి అంచనా వేస్తున్నారు. మరణాల డేటాను అందుబాటులో ఉండటం వల్ల మన మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటే బాధ కలగడం సహజమే. పెరిగిన సాంకేతికత మన ప్రాణాల మీదకు వచ్చిందని అంటున్నారు. ఈనేపథ్యంలో మరణం ఎప్పుడొస్తుందోననే బెంగ పట్టుకోవడం మామూలే.

ఇలా మన టెక్నాలజీ పెరగడం వల్ల మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలుసుకుంటే భయం పట్టుకోవడం ఖాయం. అందుకే ఎవరు కూడా తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలుసుకునేందుకు జంకుతుండటం కామన్. ఆధునికత మన ప్రాణాల గురించి చెప్పు వాస్తవాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతుంటారు. అందుకే ఈ సాంకేతికత మనకు అవసరం లేదనే వాదనలు వస్తున్నాయి.

Tags:    

Similar News