తన భార్య మెచ్చిన ఫోటో ఇదంట.. మురిసిపోతున్న ట్రంప్!

ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లోనూ ఈ పిక్ దర్శనమిచ్చింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.;

Update: 2025-05-06 05:33 GMT

రోమ్ లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొత్త పోప్ ఎంపిక గురించి తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. "నేను పోప్ అవ్వాలనుకుంటున్నాను" అని చమత్కరించారు. ఇదే తన నెంబర్ వన్ ఎంపిక అవుతుందని కొనసాగించారు. ఈ సమయంలో ఏఐ ఫోటో షేర్ చేశారు.

అవును... అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పోప్ అవ్వాలనుకుంటున్నాను అని జోక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రోమన్ కాథలిక్ పోప్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపొందించిన ఫోటోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లోనూ ఈ పిక్ దర్శనమిచ్చింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

దీనిపై స్పందించిన ఓ రిపోర్టర్... ఈ ఫోటోపై క్యాథలిక్ లు సంతోషంగా లేరని ట్రంప్ తో అన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్... ఆ ఫోటో తాను చేసింది కాదని, దాన్ని ఎవరో సరదాగా క్రియేట్ చేసిన ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారని.. ఆ ఫోటో ఎంతో క్యూట్ గా ఉందని తన భార్య కూడా చెప్పిందని.. దాన్ని మీరు ఫన్నీగా తీసుకోలేరా? అని కాస్త అసహనం ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో ఈ ఫోటోపై కొంతమంది నెటిజన్లు జోక్ గా భావిస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... స్టేట్ బిషప్ లకు ప్రతినిధ్యం వహిస్తున్న న్యూయార్క్ స్టేట్ కాథలిక్ కాన్ఫరెన్స్... ఈ పోస్టును తీవ్రంగా ఖండించింది. తమను ఎగతాళి చేయవద్దని సూచించింది.

కాగా... ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాటికన్ జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ప్రకారం... ఆయన గుండెపోటుతో మరణించారు!

Tags:    

Similar News