• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విడాకుల పుకార్లపై ధనశ్రీ...

విడాకుల పుకార్లపై ధనశ్రీ వ‌ర్మ‌ స్పంద‌న‌

| అయితే త‌న‌పై రాస్తున్న ఊహాజ‌నిత వార్త‌లు, క‌థ‌నాల‌పై ధ‌న‌శ్రీ వ‌ర్మ తీవ్ర మాన‌సిక వేదన‌కు గుర‌య్యాన‌ని తెలిపారు. త‌మ కుటుంబానికి క‌ష్ట‌కాల‌మిద‌ని అన్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-08 16:48 GMT

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నార‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి. దీనిని ఈ జంట అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. ఇంత‌లోనే నెటిజ‌నుల్లో ర‌క‌ర‌కాల సిద్ధాంతాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిది త‌ప్పు? అంటూ విచార‌ణ మొద‌లుపెట్టారు. అయితే త‌న‌పై రాస్తున్న ఊహాజ‌నిత వార్త‌లు, క‌థ‌నాల‌పై ధ‌న‌శ్రీ వ‌ర్మ తీవ్ర మాన‌సిక వేదన‌కు గుర‌య్యాన‌ని తెలిపారు. త‌మ కుటుంబానికి క‌ష్ట‌కాల‌మిద‌ని అన్నారు.

 

ఇవ‌న్నీ నిరాధారమైన‌వి.. అవాస్త‌వ క‌థ‌నాలు అని ధ‌న‌శ్రీ ఖండించారు. గత కొన్ని రోజులు తనకు, తన కుటుంబానికి చాలా సవాల్‌గా మారాయ‌ని ధ‌న‌శ్రీ ఆవేద‌న చెందారు. ఊహాజ‌నిత‌ తప్పుడు కథనాలతో తన క్యారెక్ట‌ర్ ను హత్య చేసార‌ని ధనశ్రీ వ్యాఖ్యానించారు. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.. స‌మ‌ర్థించుకోదని అన్నారు. ఇంకా ఈ ఇన్ స్టా పోస్టులో ఇలా రాసారు.

వాస్త‌వాలు తెలుసుకోకుండా ద్వేషాన్ని వ్యాపింపజేసే ముఖం లేని ట్రోల‌ర్లు నా ప్రతిష్టను హత్య చేయడంతో నేను నిజంగా క‌ల‌త‌కు గుర‌య్యాను. వృత్తిగ‌తంగా ఎద‌గ‌డానికి, పేరు తెచ్చుకోవ‌డానికి నేను సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు.. ఆన్‌లైన్‌లో సులభంగా ప్ర‌తికూల‌త‌ను ప్ర‌చారం చేస్తున్నా.. మీరు ఇతరులను ఉద్ధరించడానికి ధైర్యం, కరుణ అవసరం. నిజాన్ని దృష్టిలో పెట్టుకుని, నా విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని నిర్ణ‌యించాను. సత్యం అండగా నిలుస్తుంది.. స‌మ‌ర్థించుకోవాల్సిన అవ‌స‌రం లేదు! అని రాసారు. ఓం నమః శివాయ అంటూ లేఖ‌కు ముగింపు ఇచ్చారు.

టీమిండియా క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ కం రియాలిటీ షో స్టార్ ధనశ్రీ విడాకుల గురించి వారం రోజులుగా చాలా ప్ర‌చారం సాగింది. 2020 లో పెళ్లాడిన ఈ జంట నాలుగేళ్ల‌కే విడిపోతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో యుజ్వేంద్ర -ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు మొద‌ల‌య్యాయి. ఈ పుకార్ల‌కు కొన‌సాగింపుగా.. యుజ్వేంద్ర ధనశ్రీతో ఉన్న అన్ని ఫోటోలను సోష‌ల్ మీడియా ఖాతా నుంచి తొల‌గించాడు. అయితే ధ‌న‌శ్రీ‌ ప్రొఫైల్‌లో చాహ‌ల్ ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఈ జంట డిసెంబర్ 2020లో గురుగ్రామ్‌లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆరంభంలో ధనశ్రీ యూట్యూబ్ డ్యాన్స్ క్లాస్‌లలో చాహ‌ల్ చేరాడు. అనంత‌రం ప్రేమ కథ ప్రారంభమైంది. ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు విడాకుల పుకార్లు ఇబ్బందిక‌రంగా మారాయి.

Tags:    
  • YuzvendraChahal 
  • DhanashreeVerma 
  • CelebrityRumors 
  • SocialMediaRumors 
  • ChoreographerPratikUtekar 
  • PratikUtekar 

Similar News

మళ్లీ టారిఫ్ లా? కుక్కతోక వంకర.. ఈ ట్రంప్ బుద్ది ఇక మారదా?

2026-11-25 07:06 GMT

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!

2026-11-25 07:05 GMT

గూఢచారులకే గూఢచర్యం.. అమెరికా నిఘా కోటకు చైనా ఏఐ కన్నం.. పాపం అంకుల్ శామ్..

2026-11-25 07:05 GMT

'వందల కోట్ల' బాంబుతో రేవంత్ పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

2026-11-25 07:04 GMT

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు!

2026-11-25 04:22 GMT

విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !

2026-11-25 04:03 GMT

అటు గుండమ్మ...ఇటు రాధమ్మ

2026-11-25 04:02 GMT

కాంగ్రెస్ కి ఎస్పీ షాక్...మొదటి జాబితా రిలీజ్ !

2026-11-25 04:02 GMT

సందీప్ సర్దుబాట ... కాంగ్రెస్ కి రాచ బాటేనా ?

2026-11-25 04:02 GMT

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS