దేవినేని ఉమా... మనసులో మాట అదేనా ?

ఉమ్మడి క్రిష్ణా జిల్లా టీడీపీ నాయకులతో సీనియర్ నేతగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు చెప్పి తీరాల్సిందే.;

Update: 2025-11-28 03:33 GMT

ఉమ్మడి క్రిష్ణా జిల్లా టీడీపీ నాయకులతో సీనియర్ నేతగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు చెప్పి తీరాల్సిందే. మరో మూడేళ్ళలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితం పూర్తి చేసుకుంటున్న ఉమా టీడీపీ అధినాయకత్వానికి నమ్మకమైన నాయకుడు, అత్యంత సన్నిహితుడు అయిన నేత కూడా. ఆయన పార్టీకి ఎంతటి విధేయుడో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ 2024 ఎన్నికల్లో ప్రచారం మొదలుపెట్టి కూడా మైలవరం సీటుని పార్టీ సూచనల మేరకు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి వదిలేసుకోవడం. ఆ సమయంలోనే ఆయనకు ఒక భారీ హామీ అధినాయకత్వం నుంచి లభించింది అని కూడా ప్రచారం సాగింది. అదే నామినేట్ పోస్టు.

వేచి చూస్తున్న వైనం :

ఇక దేవినేని ఉమా తమకు దక్కే అవకాశం కోసం ఎంతో ఓపికగా వేచి చూస్తున్నారు అని అంటున్నారు ఆయన ఎక్కడా తొందర పడటం లేదు అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తగిన సమయంలో న్యాయం చేస్తారు అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన తన పనులు తాను చేసుకుంటూ పార్టీలో చురుకుగా ఉంటున్నారు. అయితే ఈ మధ్యలో ఒక ప్రచారం అయితే బయటకు వచ్చింది. అదేంటి అంటే ఉమాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని. ఆయనను ఆయన సీనియారిటీని ఢిల్లీ రాజకీయాల్లో వాడుకోవాలని పార్టీ భావిస్తోంది అన్నదే ఆ ప్రచారం.

అది చాలు అంటున్నారా :

అయితే ఈ ప్రచారం గురించి దేవినేని తన మనసులో మాటను సన్నిహితులతో కూడా పంచుకున్నారని తాజాగా మరో ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే తనకు పెద్దలు ఎవరూ చెప్పలేదు కానీ రాజ్యసభ ఇస్తారని ప్రచారం అయితే ఉందని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. అయితే తనకు మాత్రం ఢిల్లీ వెళ్ళాలని లేదని ఏపీలోనే రాజకీయం చేస్తాను అని ఉమా చెబుతున్నట్లుగా చర్చ అయితే సాగుతోంది. తాను ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే గానీ కోరుకుంటున్నాను అని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు.

ఎమ్మెల్సీ ఇస్తే ఓకే :

ఇక దేవినేని ఉమా ఎమ్మెల్సీగానే ఉండాలని చూస్తున్నారుట. లేదా 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారుట. ఇక అనుచరులు సైతం ఆయన రాజ్యసభకు వెళ్తే స్థానిక రాజకీయానికి దూరం అవుతారని కలవరపడుతున్నారని చెబుతున్నారు. దాంతో తన పట్టుని కొనసాగినడానికి క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో తన స్థానం పదిలపరచుకోవడానికి ఎమ్మెల్సీగానే చాన్స్ ఇస్తే తీసుకోవాలని చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. మరి టీడీపీ మదిలో ఏముందో ఏ హామీ ఆయనకు ఇస్తారో ఏ పదవి దక్కుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News