అమ్మతనం కోసం ఒక మహిళ దారుణమైన చర్య!

ఢిల్లీలో నివసిస్తున్న పూజాకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, ఎంత ప్రయత్నించినా ఆమెకు సంతానం కలగలేదు.;

Update: 2025-04-17 09:38 GMT

అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన కల. అయితే, కొందరికి ఆ కల నెరవేరక బాధపడుతుంటారు. ఢిల్లీకి చెందిన పూజా అనే మహిళ ఏడేళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తోంది. తాను తల్లి కాలేనని తెలుసుకున్న ఆమె, అమ్మతనం కోసం ఎంతకైనా తెగించింది. చివరికి ఆమె చేసిన పనికి పోలీసుల చేతికి చిక్కింది.

ఢిల్లీలో నివసిస్తున్న పూజాకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, ఎంత ప్రయత్నించినా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన పూజ, ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. తాను గర్భవతిగా ఉన్నట్లు భర్తను నమ్మించింది. డెలివరీ తేదీ దగ్గరపడుతుండటంతో తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.

అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆసుపత్రికి వెళ్లిన పూజ, అక్కడ ఉన్న ఒక పసిపాపను కిడ్నాప్ చేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి పూజను గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తాను తల్లి కాలేనని తెలుసుకున్నందునే ఆ పసిపాపను కిడ్నాప్ చేసినట్లు పూజ పోలీసుల ఎదుట ఒప్పుకుంది.

ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. అమ్మతనం కోసం ఒక మహిళ ఇంత దారుణమైన చర్యకు పాల్పడటం కలిచివేస్తోంది. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News