వీళ్లు లాయర్లా గూండాలా.. కోర్టులోనే తుక్కుతుక్కుగా కొట్టుకున్నరు

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కోర్టు హాలు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. విచారణ జరుగుతుండగానే న్యాయవాదులు ఒకరి మీద మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నాడు.;

Update: 2025-04-18 08:43 GMT

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కోర్టు హాలు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. విచారణ జరుగుతుండగానే న్యాయవాదులు ఒకరి మీద మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నాడు. కుర్చిలు ఎగిరాయి, కేకలు వినిపించాయి. ఇంతలో ఈ శబ్ధాలు విన్న వాళ్లంతా ఏం జరుగుతుందో అని హాల్లోకి పరుగున వచ్చారు. ఇంతకీ అసలు కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఢిల్లీలోని ఒక కోర్టు హాలులో విచారణ జరుగుతుండగా ఊహించని గందరగోళం నెలకొంది. ఈశాన్య జిల్లా కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శాంతి భద్రతల ఉల్లంఘనలకు సంబంధించిన సెక్షన్లు 107, 151 కింద నమోదైన కేసులకు సంబంధించి విచారణ జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదం ముదిరి ఒకరి మీద మరొకరు కుర్చీలు విసురుకునే స్థాయికి చేరుకుంది. కోర్టు హాలులో జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే, ఈ గొడవకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. చాలా మంది వీరిద్దరు ఆ కోర్టులోని న్యాయవాదులే అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

కోర్టు హాలులో ఇలాంటి హింసాత్మక పరిస్థితులు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి. ఇది కోర్టు మర్యాదకు తీవ్రభంగంగా పరిగణిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాల్లో కూడా భద్రత, నియంత్రణ లేకపోవడంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కాలేజీలో మరో విచిత్ర ఘటన జరిగింది. కాలేజీ ప్రిన్సిపల్ ప్రత్యూష ఒక తరగతి గది గోడలకు ఆవు పేడ పూస్తున్న వీడియో వైరల్ అయింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం వేసవి కావడంతో ఉష్ణోగ్రత నియంత్రణకు సంప్రదాయ పద్ధతులపై జరుగుతున్న పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ఆవు పేడ సహజమైన ఇన్సులేటింగ్ లక్షణాన్ని కలిగి ఉంటుందని అందువల్లే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రం ఆధారంగా చేస్తున్నట్లు ప్రత్యూష వివరించారు. ఈ ప్రాజెక్ట్‌పై వారం రోజుల్లో వివరణాత్మక పరిశోధన ఫలితాలను విడుదల చేస్తానన్నారు. శాస్త్రీయ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Tags:    

Similar News